క్రీడాభూమి

క్రికెట్ బోర్డుకు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: రాష్టప్రతి పదవికే లేని వయోపరిమితి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలక మండలి సభ్యులకు ఎందుకని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సిఎ) కార్యదర్శి నిరంజన్ షా ప్రశ్నించాడు. లోధా కమిటీ చేసిన ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటని, దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని విలేఖరులతో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం జరిగింది. దీనికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన నిరంజన్ షా పలు అంశాలను ప్రస్తావించాడు. బిసిసిఐ పాలక మండలి సభ్యులుగా 70 ఏళ్లు పైబడిన వారు అనర్హులని లోధా కమిటీ చేసిన సిఫార్సు ఆమోదయోగ్యంగా లేదన్నాడు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వయసు 81 సంవత్సరాలని, ఆయన సేవలు అందిస్తున్నప్పుడు బిసిసిఐ అధ్యక్ష పదవికి వయో పరిమితిని విధించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించాడు. వయసును పరిగణలోకి తీసుకోరాదని, ఉత్సాహం, బాధ్యతలను సమర్థంగా నిర్వహించే సామర్థ్యం ఉన్నంత వరకూ పాలక మండలిలో చురుగ్గా ఉండవచ్చని, సేవలు అందించవచ్చని పేర్కొన్నాడు. ఉత్సాహానికి, సమర్థతకు వయసును ప్రామాణికంగా తీసుకోరాదని హితవు పలికాడు.
ఒకటిన సిఒఎ సమావేశం
బిసిసిఐ పాలనాధికారుల బృందం (సిఒఎ) జూలై ఒకటో తేదీన సమావేశం కానుంది. లోధా కమిటీ సిఫార్సులను బిసిసిఐ, దాని అనుబంధ సంఘాలన్నీ తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవానికి మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ అధ్యక్షతన సిఒఎను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో మరో ముగ్గురు సభ్యులు ఉండగా, వారిలో రామచంద్ర గుహ ఇటీవలే రాజీనామా చేశాడు. మరో సభ్యుడు విక్రం లిమాయే జూలై 14న రాజీనామా సమర్పించనున్నాడు. దీనితో వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ మాత్రమే సిఒఎలో మిగులుతారు. అందుకే, లోధా సిఫార్సుల అమలుపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిఒఎ భావిస్తున్నది. శనివారం సమావేశమైన తర్వాత, సిఫార్సుల అమలుపై బిసిసిఐ సభ్య సంఘాలను ఆదేశించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరే అవకాశం ఉంది.