క్రీడాభూమి

మెస్సీ పెళ్లికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొసారియో, జూన్ 29: తల్లిదండ్రుల పెళ్లి పిల్లలు ఎవరూ చూసి ఉండరు. పిల్లల సమక్షంలో తల్లిదండ్రులు వివాహం చేసుకున్న సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పాలి. కానీ, ఈ అవకాశం బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ, అతని చిన్ననాటి స్నేహితురాలు ఆంటొనెలా రొకూజో, వారి పిల్లలు థియాగో, మటెయోలకు దక్కనుంది. సుమారు దశాబ్దకాలంగా మెస్సీ, రొకూజో సహజీవనం చేస్తున్నారు. వారికి థియాగో, మటెయో సంతానం. ఇనే్నళ్ల కాపురం తర్వాత, ఇప్పుడు వివాహం చేసుకోవాలని మెస్సీ నిర్ణయించాడు. ఇక్కడి సిటీ సెంటర్ కాంప్లెక్స్‌లో శుక్రవారం అతని పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బార్సిలోనాలో అతని సహచరులు లూయిస్ సొరేజ్, నేమార్ తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. అదే విధంగా పాప్ స్టార్ షకీరా, బార్సిలోనాకే ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె భర్త గెరార్డ్ పిక్ స్టార్ అట్రాక్షన్ కానున్నారు. కాగా, ఈ వివాహ వేడకను కవర్ చేసేందుకు 155 మంది జర్నలిస్టులకు గుర్తింపు కార్డులనిచ్చారు. సిటీ సెంటర్ ప్రాంగణమంతా భద్రతాధికారులతో నిండిపోయింది.