క్రీడాభూమి

దరఖాస్తు చేయడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి తాను రేసులో లేనని మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ గారీ కిర్‌స్టెన్ స్పష్టం చేశాడు. కోచ్‌గా దరఖాస్తులు స్వీకరించే గడువును బిసిసిఐ జూలై 9వ తేదీ వరకు పెంచడంతో, అప్పటి వరకూ రేసులో మిగతా వారి కంటే ముందున్న టామ్ మూడీ, రిచర్డ్ పీబస్, వీరేందర సెవాగ్‌లకు గట్టిపోటీ తప్పడం లేదు. రవి శాస్ర్తీ దరఖాస్తు చేసుకోవడంతో, ఇంతకు ముందు జట్టుకు డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉన్న అతనికే పగ్గాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే సమయంలో, ఇంతకు ముందు కోచ్‌గా పని చేసిన కిర్‌స్టెన్ కూడా దరఖాస్తు చేసుకుంటాడన్న వార్త తెరపైకి వచ్చింది. 2008 నుంచి 2011 వరకు అతను టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించాడు. అతని మార్గదర్శకంలోనే, 2011లో భారత జట్టు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. భారత్ జట్టు ప్రమాణాలను అమాంతం పెంచిన సమర్థుడైన కోచ్‌గా అతనికి మంచి పేరు ఉంది. నిజానికి ఆరేళ్ల క్రితమే అతని కాంట్రాక్టును పొడిగించాలని బిసిసిఐ నిర్ణయించింది. అతను పెట్టే ఎలాంటి షరతులనైనా పూర్తి చేసేందుకు సిద్ధమైంది. కానీ, తాను స్వదేశానికి వెళతానని, కోచ్‌గా బాధ్యతలను కొనసాగించలేనని పేర్కొన్న కిర్‌స్టెన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఇప్పుడు అతను దరఖాస్తు చేసుకుంటే, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి (సిఎసి) తప్పకుండా అతని పట్ల మొగ్గు చూపుతుంది. కానీ, తాను దరఖాస్తు చేయడం లేదని కిర్‌స్టెన్ స్పష్టం చేశాడు. తన పట్ల భారత్ క్రికెట్ అధికారులు, అభిమానులు చూపుతున్న నమ్మకానికి కృతజ్ఞతలు చెప్తున్నానని ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తికాల కోచ్‌గా బాధ్యతలు స్వీకరించలేనని పేర్కొన్నాడు. భవిష్యత్తు గురించి చెప్పలేకపోయినా, ఇప్పుడు మాత్రం టీమిండియా కోచ్‌గా ఉండే అవకాశాలు ఏమాత్రం లేవని తెలిపాడు.

చిత్రం.. గారీ కిర్‌స్టెన్