క్రీడాభూమి

కాంట్రాక్టుపై సంతకం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 29: కొత్త ఒప్పందంపై వెంటనే సంతకం చేయాల్సిందిగా ఆటగాళ్ల ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) లేఖ రాసింది. అయితే, ఇది ఒక లాంఛనం మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. నిజానికి క్రికెటర్లతో ఇప్పటికీ సిఎ దాదాపుగా రాజీకొచ్చింది. క్రికెటర్ల సంఘం (ఎసిఎ)తో చర్చలు జరిపిన తర్వాత రాజీ సూత్రాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెటర్లతోపాటు, ఫస్ట్‌క్లాస్ స్థాయి ఆటగాళ్లకు కూడా లాభాల్లో వాటా ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్టు తెలిపింది. అయితే, ఎసిఎ ఈ ప్రతిపాదనకు ఆమోదం చెప్పినట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. సిఎ, ఎసిఎ మధ్య కాంట్రాక్టుపై చాలాకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈనెల 30వ తేదీతో ప్రస్తుత కాంట్రాక్టు పూర్తవుతుంది. జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చే కొత్త ఒప్పందాలకు సంబంధించి సిఎ కొన్ని షరతులు విధించింది. కాంట్రాక్టు మొత్తాన్ని పెంచాలన్న ఎసిఎ డిమాండ్‌ను ఖాతరు చేయకలేదు. కాగా, సిఎ తీరును క్రికెటర్లు తప్పుపడుతున్నారు. కొత్త కాంట్రాక్టుపై సంతకం చేసేది లేదని తేల్చిచెప్తున్నారు. అవసరమైతే, ఇంగ్లాండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. వారు అన్నంత పని చేస్తారన్న భయం సిఎ అధికారులకు లేకపోలేదు. ఆసీస్ ఆటగాళ్లు ఎవరికీ భయపడరు. కాంట్రాక్టులు పోతాయనో, జాతీయ జట్టులో స్థానం దక్కదనో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వంటి టోర్నీలు దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. దేశానికి జీవితకాలం ఆడినా లభించనంత మొత్తం ఐపిఎల్ వంటి టోర్నమెంట్స్ ఒకటిరెండు సీజన్లలోనే లభిస్తుంది. దీనికితోడు స్వదేశంలోనే బిగ్ బాష్ లీగ్ ఉంది. ఇక ఇంగ్లీష్ కౌంటీలు ఉండనే ఉన్నాయి. సంపాదించడానికి ఇన్ని దగ్గర మార్గాలు ఉండగా, జాతీయ జట్టుపైనే ఆధారపడాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదన్న రీతిలో ఆసీస్ క్రికెటర్లు వ్యవహరిస్తున్నారు. సంవత్సరాల తరబడి శ్రమించడం, చెమటోడ్చడం, ఒక్కో మెట్టు ఎక్కుతూ జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఏమాత్రం సులభమైన విషయాలు కాదు. ఒకవేళ జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడాలి. అందుకే, సిఎతో కాంట్రాక్టుకంటే, ఐపిఎల్ వేలంలో అవకాశం కోసమే ఆసీస్ క్రికెటర్లు ఎదురుచూస్తుంటారు. ఈ పరిణామాల వల్ల క్రికెట్‌లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయని, ఆటగాళ్లు జాతీయ సేవలకు అందుబాటులో లేకుండా పోతున్నారని సిఎ ఆందోళన చెందుతున్నది. కఠినంగా వ్యవహరిస్తే, మొదటికే మోసం వస్తుందనే భయం అధికారులను వెంటాడుతున్నది. ఈ పరిస్థితుల్లో ఎసిఎతో రాజీకి తెల్లజెండా చూపడం మినహా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ‘కర్ర విరక్కూడదు.. పాము చావకూడదు’ అన్న చందంగా వ్యవహరించి, ఆటగాళ్లకు తాయిలాలు ప్రకటించింది. ఏ స్థాయి కాంట్రాక్టు పొందిన వారికైనా మిగులు సొమ్ములో వాటానిస్తామని తెలిపింది. పురుషులు, మహిళల విభాగాల్లో అంతర్జాతీయ క్రికెటర్లకు 15 మిలియన్ డాలర్లు లభించే అవకాశం ఉందని తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే, కనీసం ఎంత మొత్తం దక్కుతుందనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మిగులు సొమ్ములో వాటా అని ప్రకటించడమే సిఎ అనుసరిస్తున్న వ్యూహానికి నిదర్శనం. శుక్రవారంతో పాత కాంట్రాక్టు ముగుస్తుంది కాబట్టి, శనివారం నాటికి క్రికెటర్లంతా తప్పనిసరిగా కొత్త కాంట్రాక్టుపై సంతకాలు చేయాలి. లేకపోతే, నిబంధనవాళిని మార్చాల్సి వస్తుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండేందుకే, ఒప్పంద పత్రాలపై సంతకాలను సిఎ కోరుతున్నది. ఆటగాళ్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.