క్రీడాభూమి

రేసులోకి ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: టీమిండియా కోచ్ పదవికి మాజీ ఆల్‌రౌండర్ రవి శాస్ర్తీ దరఖాస్తు చేసుకున్న 24 గంటలు కూడా పూర్తికాక ముందే మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన దరఖాస్తును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి పంపాడు. కర్నాటకకు చెందిన 47 ఏళ్ల ప్రసాద్ కెరీర్ 33 టెస్టులు ఆడాడు. 203 పరుగులు చేశాడు. 30 (నాటౌట్) టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు. 161 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను 221 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 19 పరుగులు. కాగా, టెస్టుల్లో 7,041 బంతులు వేసి, 3,360 పరుగులిచ్చి 96 వికెట్లు కూల్చాడు. పాకిస్తాన్‌పై 33 పరుగులకు ఆరు వికెట్లు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. వనే్డల్లో 8,129 బంతులు వేసి, 6,332 పరుగులిచ్చాడు. 196 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 27 పరుగులకు ఐదు వికెట్లు సాధించాడు. తన రాష్ట్రానికే చెందిన జవగళ్ శ్రీనాథ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న ప్రసాద్ 1996లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించి, 2001లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆతర్వాత కొన్నాళ్లు భారత అండర్-19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అనంతరం కర్నాటక జట్టుకు కోచ్‌గా సేవలు అందించాడు. 2007 మే మాసంలో బంగ్లాదేశ్‌కు వెళ్లిన టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ల్లోనూ అతను బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అప్పట్లో యువ పేసర్లు పేసర్లు జహీర్ ఖాన్, ఇశాంత్ శర్మ అతని పర్యవేక్షణలోనే రాటుదేలారు. క్రికెటర్‌గా తాను సాధించలేకపోయిన విజయాలను, బౌలింగ్ కోచ్‌గా సాధించాడు. ఇంగ్లాండ్, కివీస్ జట్లపై భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. అయితే, 2009లో జరిగిన ఐసిసి ఈవెంట్స్‌లో జహీర్, ఇశాంత్ దారుణంగా విఫలమయ్యారు. వారు రాణించలేకపోవడంతో, భారత్ దారుణ పరాజయాలను చవిచూసింది. దీనితో ప్రసాద్ ఉద్వాసనను ఎదుర్కోక తప్పలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా అతను బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఈ ఫ్రాంచైజీపై రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడడంతో, 2016, 2017 ఐపిఎల్‌లో బరిలోకి దిగే అవకాశం దక్కలేదు. సమర్థుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, మంచివాడిగా పేరు సంపాదించిన ప్రసాద్ దరఖాస్తు చేసుకోవడంతో, కోచ్ పదవికి ఎవరు ఎంపికవుతారన్నది ఆసక్తిని రేపుతున్నది. దరఖాస్తులు స్వీకరణకు జూలై 9వ తేదీ వరకు గడువు ఉండడంతో ఇంకెంత మంది దరఖాస్తు చేసుకుంటారో చూడాలి.

చిత్రం.. వెంకటేశ్ ప్రసాద్