క్రీడాభూమి

ఇక ప్రయోగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (అంటిగువా), జూన్ 29: వెస్టిండీస్‌పై ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా చేసుకున్న టీమిండియా శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో వనే్డను భారత్ గెల్చుకున్న విషయం తెలిసిందే. మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే, సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండదు కాబట్టి, ముందుగా ఆ మైలురాయిని చేరుకోవడమే కీలకంగా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా భావిస్తున్నది. రెండో మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను చిత్తుచేసిన ఉత్సాహంతో, మరోసారి అలాంటి ఫలితానే్న రాబట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఓపెనర్లు అజింక్య రహానే, శిఖర్ ధావన్, కెప్టెన్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండడం టీమిండియాకు లాభించే అంశం. సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కీలక భూమిక పోషిస్తారు. బౌలింగ్ విభాగానికి వస్తే, పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇలావుంటే, ప్రస్తుతం విండీస్ జట్టు ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బలహీనంగా ఉంది కాబట్టి, చివరి మూడు వనే్డల్లో ప్రయోగాలకు కోహ్లీ సిద్ధమపడవచ్చని అంటున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. అందుకే, బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి కూడా ఇదే సరైన సమయమని కోహ్లీ భావిస్తాడన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో, ధోనీకి విశ్రాంతినిచ్చి, యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్న ఆసక్తి రేపుతున్నది. పంత్‌కు మూడో వనే్డలో ఆడే అవకాశం దక్కవచ్చని కోహ్లీ ఇది వరకే సూచన ప్రాయంగా చెప్పడంతో, ధోనీని తప్పిస్తారా లేక కీపర్‌గా కాకపోయినా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా తుది జట్టులోనే ఉంచుతారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వీటికి సమాధానం కోసం వేచి చూడక తప్పదు. మొత్తం మీద కోహ్లీ దీనిని ప్రయోగాలకు అనుకూలమైన సమయంగా స్వీకరిస్తాడా లేక రెండో వనే్డలో గెలిచిన జట్టునే ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దించుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.