క్రీడాభూమి

మందానా శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్, జూన్ 29: స్మృతి మందానా సూపర్ సెంచరీతో రాణించడంతో, మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత్ అదే ఉత్సాహంతో విండీస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను 50 ఓవర్లలో 183 పరుగులకే పరిమితం చేసింది. హేలీ మాథ్యూస్ (43), అఫి ఫ్లెచర్ (36 నాటౌట్) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. పూనమ్ యాదవ్ కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా చెరి రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 42.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్ స్మృతి మందానా అద్భుతమైన సెంచరీతో నాటౌట్‌గా నిలిచింది. 108 బంతులు ఎదుర్కొన్న ఆమె 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 106 పరుగులు సాధించింది. మిథాలీ రాజ్ 46 పరుగులు చేసి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. వీరిద్దరి ప్రతిభతో భారత్ ఇంకా 45 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మందానాకు లభించింది.

చిత్రం.. మహిళల ప్రపంచ కప్‌లో గురువారం వెస్టిండీస్‌పై అజేయ శతకంతో రాణించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న స్మృతి మందానా