క్రీడాభూమి

ఆసీస్ క్రికెటర్లు ఇక నిరుద్యోగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జూన్ 30: ఆస్ట్రేలియా క్రికెట్‌లో నెలకొన్న అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఎసిఎ) మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి రాలేదు. దీనితో తాజా కాంట్రాక్టుపై క్రికెటర్లు ఎవరూ సంతకాలు చేయలేదు. ఇంతకు ముందున్న కాంట్రాక్టు శుక్రవారంతో ముగిసిన కారణంగా, కొత్త కాంట్రాక్టు లేకపోవడంతో ఆసీస్ క్రికెటర్లంతా ఇప్పుడు నిరుద్యోగులుగా మారారు. పాత కాంట్రాక్టు ముగియడానికి శుక్రవారం అర్ధ రాత్రి వరకూ సమయం ఉంది కాబట్టి, చివరి క్షణాల్లో లేదా ఒకటో తేదీ పూర్తికాక ముందే కొత్త ఒప్పందంపై సంతకాలు చేద్దామన్న అభిప్రాయం క్రికెటర్లలో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, చివరి వరకూ తాత్సారం చేసి, హఠాత్తుగా సంతకాలు చేస్తామంటే కుదరదని సిఎ తేల్చిచెప్పింది. దీనితో ఆసీస్ క్రికెట్ పరిస్థితి గందరగోళంలో పడింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆస్ట్రేలియా ఇలాంటి అంతర్గత సమస్యల కారణంగానే తిరోగమన దిశగా పరుగులు తీస్తున్నదనేది వాస్తవం. క్రికెటర్లంతా ఎవరికి వారే తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవాలని అనుకోవడం ఒకవైపు, సిఎ అధికారుల మొండి వైఖరి మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్‌ను వేరుపురుగుల్లా తొలిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం, ఆధిపత్య పోరాటం, జట్టు ప్రయోజనాలను గాలికి వదలడం, స్వప్రయోజనాలకే పెద్దపీట వేయడం వంటి అనేకానేక అంశాలు ఆసీస్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఆటగాళ్ల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరాటాలు కొనసాగితే, ఇప్పుడు సిఎ అధికారులతో విభేదాలు తీవ్రమయ్యాయి. కాంట్రాక్టుపై సంతకాలు చేసిన తర్వాత జీతభత్యాల పెంపు వంటి డిమాండ్లను పరిశీలిస్తామని సిఎ స్పష్టం చేస్తుంటే, తమ డిమాండ్లకు అనుగుణంగా కాంట్రాక్టులోని అంశాలను మారిస్తేనే సంతకాలు చేస్తామని క్రికెటర్లు పట్టుబట్టారు. ఎవరికి వారు ఒక్క మెట్టు కూడా కిందకు దికపోవడం సమస్య జటిలంగా మారింది. చివరి క్షణాల్లో ఇరు వర్గాలు రాజీకి వచ్చే సూచనలు కనిపించాయి. తమ డిమాండ్లపై స్పందించాల్సిందిగా ప్రభుత్వానికి ఎసిఎ విజ్ఞప్తి చేసింది. మరోవైపు సిఎ కూడా రాజీ సూత్రాన్ని ప్రకటించింది. మిగులు లాభాల్లో ఆటగాళ్లకు వాటా ఇస్తామని ప్రతిపాదించింది. కానీ, ఈ మొత్తం ఎంత అనేది స్పష్టం చేయలేదు. ఈ ప్రతిపాదనపై ఎసిఎ చర్చించిన దాఖలాలు లేవు. కారణాలు ఏవైనప్పటికీ, సిఎ కొత్త ఫార్ములాకు క్రికెటర్లు లిఖితపూర్వకంగా ఆమోదం తెలపలేదు. కాంట్రాక్టుపై సంతకాలు చేయలేదు. సుమారు 200 మందికి వివిధ గ్రేడ్స్‌లో సెంట్రల్ కాంట్రక్టు ఉండేది. ఇప్పుడు అది లేకపోతే, వీరంతా నిరుద్యోగులవుతారు.