క్రీడాభూమి

రెండు దశాబ్దాల మెస్సీ, రొకూజో ప్రేమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొసారియో, జూన్ 30: అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ, సుమారు దశాబ్దం సహచర జీవితాన్ని గడిపిన తర్వాత శుక్రవారం అతను పెళ్లి చేసుకున్న ఆంటోనెలా రొకూజో మధ్య ప్రేమాయణం నిన్నమొన్నటిది కాదు. ఇద్దరూ ఒక ప్రాంతానికి చెదిన వారు. మెస్సీ తన తొమ్మిదో ఏట మొదటిసారి రొకూజోను చూశాడు. చూసిందే తడవుగా ఆమె పట్ల ఇష్టం పెంచుకున్నాడు. 29 ఏళ్లు పూర్తి చేసుకొని, 30వ ఏట అడుగుపెట్టిన అతనికి రొకూజోతో ఉన్న ప్రేమ వయసు 20 సంవత్సరాలు. మెస్సీ తన 13వ ఏటనే బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరాడు. స్పెయిన్‌కు వెళ్లినప్పటికీ అతను రొకూజోతో తరచు ఫోన్‌లో మాట్లాడేవాడు. ఉత్తరాలు రాసేవాడు. బెల్లావిస్టాలో ఉంటున్న రొకూజో చదువు సాఫీగా సాగలేదు. అతి కష్టం మీద హై స్కూల్ చదువు పూర్తి చేసింది. కమ్యూనికేషన్స్‌లో స్పెషలైజేషన్ చేయాలని అనుకుంది. కానీ, చదువు కంటే, స్పెయిన్‌లో మెస్సీ ఎట్లా ఉన్నాడోనన్న భయం ఆమెను నిరంతరం వేధించేది. ఇలాంటి పరిస్థితుల్లో చదువు కొనసాగదని నిర్ధారణకు వచ్చిన ఆమె నేరుగా స్పెయిన్ వెళ్లింది. అక్కడ మెస్సీని కలిసింది. గత దశాబ్ద కాలంగా అతనితో సహజీవనం చేస్తున్నది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దవాడైన థియాగో 2012లో జన్మించాడు. చిన్నవాడైన మటెయో 2015లో పుట్టాడు.
ఇద్దరు పిల్లల తల్లి ఇనే్నళ్లకు పెళ్లికూతురైంది. తమ సాహచర్యాన్ని అధికారికంగా భార్యాభర్తల అనుబంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న మెస్సీ శుక్రవారం రొకూజోను పెళ్లి చేసుకున్నాడు. పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులు, హాలీవుడ్ స్టార్లు, ప్రముఖులు వీరి వివాహానికి హారయ్యారు.