క్రీడాభూమి

మైర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూన్ 30: ఆల్‌రౌండర్ సాలమన్ మైర్ సూపర్ సెంచరీతో రాణించడంతో, శుక్రవారం ఇక్కడ జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో శ్రీలంకపై జింబాబ్వే ఆరు వికెట్ల తేడతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న లంక 50 ఓవర్లలో 5 వికెట్లకు 316 పరుగులు సాధించింది. ధనుష్క గుణతిలక (77 బంతుల్లో 60), కుశాల్ మెండిస్ (80 బంతుల్లో 86), ఉపుల్ తరంగ (73 బంతుల్లో 79 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించడంతో లంక స్కోరు మూడు వందల పరుగుల మైలురాయిని దాటింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేశాడు. టెండై చతారా 49 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. సిన్ విలియమ్స్, గ్రేమ్ క్రెమెర్, సాలమన్ మైర్ తలా ఒక్కో వికెట్ సాధించారు. అనంతరం 319 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకో వడానికి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 47.4 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసి, ఇంకా 14 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. మైర్ 96 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లతో 112 పరుగులు చేసి, జింబాబ్వే విజయానికి బాటలు వేశాడు. విలియమ్స్ 69 బంతుల్లో 65, సికందర్ రజా 56 బంతుల్లో 67 (నాటౌట్) చొప్పున పరుగులు రాబట్టి, లంక బౌలింగ్‌లో పస లేదని నిరూపించారు. మాల్కం వాలర్ 40 పరుగులు చేసి, సికందర్ రజాతో కలిసి నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీ హీరో మైర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆరు వికెట్ల తేడాతో గెలిచిన జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 5 వికెట్లకు 316 (్ధనుష్క గుణతిలక 60, కుశాల్ మెండిస్ 86, ఉపుల్ తరంగ 79 నాటౌట్, ఏంజెలో మాథ్యూస్ 43, టెండై చతారా 2/40).
జింబాబ్వే ఇన్నింగ్స్: 47.4 ఓవర్లలో 4 వికెట్లకు 32 2 (సాలమన్ మైర్ 112, విలియమ్స్ 65, సికందర్ రాజా 67 నాటౌట్, మాల్కం వాలర్ 40 నాటౌట్).

చిత్రం.. సెంచరీ చేసిన ఆనందాన్ని విలియమ్స్‌తో పంచుకుంటున్న సాలమన్ మైర్