క్రీడాభూమి

జాతీయ సేవలకే ద్రవిడ్ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: చాలా మంది మాజీ క్రికె టర్లు డబ్బు సంపాదించడానికే ప్రాధాన్యతనిస్తూ, జాతీయ సేవలను విస్మరిస్తున్న తరుణంలో రా హుల్ ద్రవిడ్ అందుకు భిన్నంగా జాతీయ సేవల కే తాను సేవలు అందిస్తానని ప్రకటించాడు. ఐపి ఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తు న్న అతను ఆ పదవికి రాజీనామా చేశాడు. జాతీ య ‘ఎ’ జట్టుతోపాటు, అండర్-19 జట్టుకు కోచ్ గా కొనసాగుతానని ప్రకటించాడు. బిసిసిఐలో ఏదో ఒక పదవిని అనుభవిస్తూ, ఐపిఎల్‌లోనూ కొనసాగడం పట్ల సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందంలోని సభ్యుడు రామచంద్ర గుహ తన రాజీనామా లేఖలో విమ ర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ద్రవిడ్ తాను ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఇకపై సేవలు అందించేది లేదని తెలిపాడు. జాతీయ జట్లకు కోచ్‌గా ఉండడానికే తాను ఇష్టపడతానని అతను స్పష్టం చేశాడు.