క్రీడాభూమి

వీనస్ పొరపాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, జూన్ 30: టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ చేసిన పొరపాటు వల్ల 78 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మియామీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 9న పామ్ బీజ్ గార్డెన్స్ ప్రాంతంలో కారులో వెళుతున్న వీనస్ హఠాత్తుగా మార్గాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో కారును దాదాపు నిలిపేసింది. వీనస్ కారు ఊహించని విధంగా ఆగిపోవడంతో, ఆ వెనకే వస్తున్న మరో కారు దీనిని ఢీ కొంది. అందులో ప్రయాణిస్తున్న 78 వృద్ధుడి తలకు తీవ్ర గాయాలుకాగా, కారును నడుపుతున్న అతని భార్య కూడా బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. లేన్ ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన కనీస వేగాన్ని పాటించకుండా, హఠాత్తుగా వాహనాన్ని రోడ్డుపై నిలపడంతో తమ కారు దిశను మార్చే అవకాశం లేకపోయిందని మృతుడి భార్య వాపోయింది. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేలోపే తాను నడుపుతున్న వాహనం వెళ్లి వీనస్ కారును ఢీ కొందని తెలిపింది. వీనస్ నిబంధనలను అతిక్రమించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ఇలావుంటే, వీనస్‌పై మియామీ పోలీసులు ఇంత వరకూ కేసు పెట్టలేదు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ప్రకటించారు. త్వరలోనే పూర్తి నివేదికను సమర్పిస్తామని చెప్పారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఆడబోతున్న వీనస్‌పై ఈ సంఘటన ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. కాగా, ప్రమాదంపై వీనస్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒక వ్యక్తిని కోల్పోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని వ్యాఖ్యానించింది.

చిత్రం.. వీనస్ విలియమ్స్