క్రీడాభూమి

కోచ్ ఎంపికలో మా జోక్యం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్, జూన్ 30: కోచ్ ఎంపికలో క్రికెటర్ల జోక్యం ఏమాత్రం ఉండదని, ఒకవేళ తమను అడిగితే అభిప్రాయాలను వెల్లడిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు అనిల్ కుంబ్లేను కోచ్‌గా కొనసాగించాలని బిసిసిఐ భావించినప్పటికీ, ఆ ప్రతిపాదనకు అతను నిరాకరించిన విషయం తెలిసిందే. చాంపియన్స్ ట్రోఫీతో కోచ్‌గా తన పదవీ కాలం పూర్తికాగా, ఈ పదవి ఖాళీ అవుతుందని, ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవచ్చని బిసిసిఐ చేసిన ప్రకటన కుంబ్లేను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక దశలో అతను మరోసారి రేసులోకి దిగేందుకు సిద్ధపడ్డాడు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో, టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్‌కు బయలుదేరిన తర్వాత తాను కోచ్‌గా ఉండనంటూ రాజీనామా చేశాడు. ఈ పరిణామంతో కంగుతిన్న బిసిసిఐ దరఖాస్తుల స్వీకరణ గడువును జూలై 9వ తేదీ వరకు పొడిగించింది. కుంబ్లేతో కోహ్లీ తీవ్రంగా విభేదించాడని, అందుకే కొత్త కోచ్ కోసం బిసిసిఐ వెతుకులాట తప్పలేదని మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి. జట్టుపై పూర్తి పట్టు కోసం ప్రయత్నిస్తున్న కోహ్లీ కోచ్ పదవిని నామమాత్రంగా మార్చేయాలని చూస్తున్నట్టు విమర్శలు కూడా వచ్చాయి. పరిస్థితిని గమనించిన కోహ్లీ తీవ్రమవుతున్న వివాదానికి తెరదించే ప్రయత్నంలో పడ్డాడు. అందులో భాగంగానే కోచ్ ఎంపికలో తానుగానీ, జట్టులోని ఇతర క్రికెటర్లుగానీ జోక్యం చేసుకోరని తేల్చిచెప్పాడు. ఒకవేల బిసిసిఐ లేదా క్రికెట్ సలహా మండలి (సిఎసి) సభ్యులు అడిగితే తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని శుక్రవారం పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. కోచ్ ఎంపిక విధానాన్ని తాము గౌరవిస్తామని అంటూనే, జట్టు అభిప్రాయాలను కోరినప్పుడు తప్పక వివరాలు అందిస్తామని స్పష్టం చేశాడు. కోచ్ ఎంపిక ప్రక్రియలో కెప్టెన్‌ను, ఇతర ఆటగాళ్లను బిసిసిఐ పక్కకుపెట్టిందని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ ఆ విషయాలను గురించి ఆలోచించే సమయం తమకు లేదన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్ జరుగుతున్నదని, తమ దృష్టి దీనిపైనే కేంద్రీకృతమైందని తెలిపాడు. కోచ్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్నది తమకు సంబంధించిన అంశం కాదన్నాడు. అవసరమని ఎవరైనా కోరుకుంటే, తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని, లేకపోతే లేదని అన్నాడు.