క్రీడాభూమి

గెలిస్తే రికార్డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 30: ‘టెన్నిస్ జంటిల్మన్’ రోజర్ ఫెదరర్ కెరీర్‌లో మరోసారి వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ చాంపియన్‌షిప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకవేళ టైటిల్‌ను సాధిస్తే సరికొత్త రికార్డును నెలకొల్పుతాడు. వింబుల్డన్ ఓపెన్ టోర్నీగా మారిన తర్వాత పురుషుల సింగిల్స్ టైటిల్ అందుకున్న వారిలో ఎక్కువ యవసున్న ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంటాడు. ఓపెన్ శకంలో ఆర్థర్ ఆషే పేరిట ఈ రికార్డు ఉంది. 1975లో విజేతగా నిలిచినప్పుడు అతని వయసు 31 సంవత్సరాలు. ఈ ఏడాది ఆగస్టులో 36వ ఏట అడుగుపెట్టనున్న ఫెదరర్‌కు టైటిల్ దక్కితే, ఆషే రికార్డును అతను అధిగమిస్తాడు. అయితే, వింబుల్డన్ ఈవెంట్‌ను పరిగణలోకి తీసుకుంటే, ఓపెన్ శకం ప్రారంభానికి ముందు, 1909లో ఆర్థర్ గోరే టైటిల్ సాధించే సమయానికి అతని వయసు 41 సంవత్సరాలు. గోరే రికార్డును బద్దలు చేసే అవకాశాలు ఎలావున్నా, ఆషే రికార్డును అధిగమించే అవకాశాలు మాత్రం ఫెదరర్‌కు పుష్కలంగా ఉన్నాయి. నిరుడు సెమీ ఫైనల్స్ వరకూ చేరినప్పటికీ, మిలోస్ రోనిక్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆతర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో, సీజన్‌లో మిగతా టోర్నీల్లో ఆడలేకపోయాడు. అంతకు ముందు, 2012లో చివరిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన ఫెదరర్ కెరీర్ ముగిసిందనీ, అతను పూర్తి ఫిట్నెస్ సంపాదించడం, గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో రాణించి టైటిళ్లు అందుకోవడం అసాధ్యమని చాలా మంది జోస్యం చెప్పారు. అంతకు ముందు నాలుగేళ్లుగా ఒక్క గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకోలేకపోవడంతో, ఈ వాదనలో నిజం ఉన్నట్టే కనిపించింది. కానీ, ఈ ఏడాది ఆరంభంలో ఫెదరర్ అందరి అంచనాలను తారుమారు చేశాడు. తన ఫిట్నెస్, ఫామ్‌పై తలెత్తిన అనుమానాలకు తెరదించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయభేరి మోగించి, కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ స్వీకరించాడు. కానీ, ఆ వెంటనే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రొలాండ్ గారోస్ టోర్నీ క్లే కోర్టుపై జరుగుతుంది కాబట్టి, అందులో రాణించే అవకాశాలు అంతంత మాత్రమేనని భావించిన ఫెదరర్ పారిస్‌కు వెళ్లలేదని అతని సన్నిహితులే వ్యాఖ్యానించారు. గ్రాస్ కోర్టులపై చెలరేగిపోతాడని, అందుకే, వింబుల్డన్‌లో ఫేవరిట్స్‌లో ఒకడిగా ఉన్నాడని వారి నమ్మకం. ఇలావుంటే, ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకున్నప్పటికీ ఫెదరర్‌ను గొప్ప పోటీదారుడిగా అంగీకరించని వారు కూడా ఉన్నారు. ఆ విజయం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌కు హాజరుకాకపోవడమే అతని ఫిట్నెస్‌పై అనుమానాలు రేపుతున్నదని వారు అంటున్నారు. అంతేగాక, వింబుల్డన్‌కు వామప్ టోర్నీగా పేర్కొనే స్టట్‌గార్ట్ ఎటిపి ఈవెంట్ మొదటి రౌండ్‌లోనే ఓడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 2002 వింబుల్డన్‌లో మరియో ఆన్సిక్ చేతిలో మొదటి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత ఫెదరర్ సుమారు 15 సంవత్సరాలు ఆ స్థాయిలో విఫలం కాలేదు. స్టట్‌గార్ట్ ఓటమి అతని పిట్నెస్‌ను, ఫామ్‌ను అనుమానంగా చూడాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే, మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయభేరి మోగించిన రాఫెల్ నాదల్ వంటి స్టార్లతో ఫెదరర్‌కు సమస్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎవరెవరి అంచనాలు ఎలావున్నా, ఫెదరర్ మాత్రం వింబుల్డన్‌లో విజయ కేతనం ఎగరేస్తానన్న ధీమాతో ఉన్నాడు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి విజేత ఎవరన్నది చెప్పలేకపోయినా, బలమైన పోటీదారుల జాబితాలో ఫెదరర్ పేరు కూడా చేరుతుంది.