క్రీడాభూమి

హసరంగ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 2: కెరీర్‌లో మొదటి వనే్డ ఆడిన వనిదు హసరంగ హ్యాట్రిక్ నమోదు చేయడంతో, ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వనే్డలో జింబాబ్వేను శ్రీలంక కేవలం 155 పరుగులకే కట్టడి చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి అందుకోవడం ద్వారా, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి వనే్డలో జింబాబ్వే గెలుపొందింది. రెండో వనే్డలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 33.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ హామిల్టన్ మసకజా 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మాల్కం వాలర్ 38 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలం కావడంతో జింబాబ్వే గౌరవ ప్రదమైన స్కోరు చేయలేకపోయింది. లంక బౌలర్లలో లక్షన్ సడాకన్ 52 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చగా, తొలి వనే్డలోనే అదరగొట్టిన హసరంగ 2.4 ఓవర్లు బౌల్ చేసి, 15 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 30.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి, మరో 119 బంతులు మిగిలి ఉండగానే విజయభేరి మోగించింది. దనుష్క గుణతిలక (8), కుశాల్ మెండిస్ (0) సింగిల్ డిజిట్స్‌కే వెనుదిరగ్గా, నిరోషన్ డిక్‌విల్లా 35 పరుగులు చేశాడు. ఆతర్వాత ఉపుల్ తరంగ (86 బంతుల్లో 75 నాటౌట్), కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (35 బంతుల్లో 28 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జట్టును గెలిపించారు.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే ఇన్నింగ్స్: 33.4 ఓవర్లలో 155 ఆలౌట్ (హామిల్టన్ మసకజా 41, వాలర్ 38, క్రెగ్ ఇవాన్స్ 22, లక్షన్ సండాకన్ 4/52, వనిదు హసరంగ 3/15).
శ్రీలంక ఇన్నింగ్స్: 30.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 (నిరోషన్ డిక్‌విల్లా 35, ఉపుల్ తరంగ 75 నాటౌట్, ఏంజెలో మాథ్యూస్ 28 నాటౌట్, టెండై చతారా 2/33).

చిత్రం.. ఆడిన తొలి వనే్డలోనే హ్యాట్రిక్‌ను నమోదు చేసిన మూడో
బౌలర్‌గా రికార్డు సృష్టించిన వనిదు హసరంగ. ఇంతకు ముందు తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), కాగిసో రబదా (దక్షిణాఫ్రికా) ఈ ఫీట్‌ను సాధించారు