క్రీడాభూమి

దక్షిణాఫ్రికా టూర్‌కు ఆస్ట్రేలియా ‘ఎ’ ససేమిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూలై 2: కాంట్రాక్టు వివాదానికి తెరపడకపోవడంతో, దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లేందుకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు నిరాకరించింది. సమస్యకు తెరపడే వరకూ ఎవరూ జాతీయ జట్ల తరఫున మ్యాచ్‌లు ఆడబోరని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఎసిఎ) ప్రకటించింది. జూన్ 30 తేదీతో పాత కాంట్రాక్టు ముగియగా, కొత్త ఒప్పందంపై తలెత్తిన వివాదం కారణంగా ఆటగాళ్లు ఎవరూ సంతకాలు చేయలేదు. దీనితో ప్రస్తుతం సుమారు 230 మంది క్రికెటర్లు కాంట్రాక్టులు లేక, నిరుద్యోగులుగా మారారు. ఈ పరిస్థితుల్లో టూర్లకు వెళ్లడం, మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులకు ఎసిఎ తేల్చిచెప్పింది.