క్రీడాభూమి

ఆ నలుగురు.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్‌లో నలుగురు సీనియర్ ఆటగాళ్లు టైటిల్ రేసులో ముందున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్ మధ్యే పోటీ తీవ్రంగా ఉంటుందని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌ను, ఇటీవల జరిగిన వివిధ టోర్నీల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే, వింబుల్డన్ టైటిల్ వేటలో వీరు ముందుంటారని స్పష్టమవుతుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించి, ఒక మేజర్ టోర్నీలో విజేతగా నిలిచేందుకు వయసుతో పనిలేదని నిరూపించాడు ఫెదరర్. ఈ ఏడాది జరిగిన రెండో గ్రాండ్ శ్లామ్ ఫ్రెంచ్ ఓపెన్. మోకాలి నొప్పిని జయించి, ఫిట్నెస్ సమస్యలను అధిగమించి నాదల్ పదోసారి రొలాండ్ గారోస్‌లో టైటిల్ అందుకున్నాడు. ఏడాదిలో మూడో గ్రాండ్ శ్లామ్ వింబుల్డన్‌పై వీరిద్దరూ తమదైన ముద్ర వేస్తారనడంలో అనుమానం లేదు. ఇక ప్రపంచ నంబర్ వన్ ముర్రే స్కాట్‌లాండ్ పౌరుడైనప్పటికీ, లండన్‌తో అతనికి అవినాభావ సంబంధం ఉంది. అక్కడ అతను వేలాది మంది అభిమానుల సమక్షంలో పోటీకి రెడీగా ఉన్నాడు. టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశాలు అతనికి లేకపోలేదు. అయితే, వింబుల్డన్‌కు వామప్‌గా పేర్కొనే హర్లిగమ్ క్లబ్ టోర్నీ నుంచి వైదొలగడం అనుమానాలకు తావిస్తున్నది. కండరాల నొప్పితో ఆ టోర్నీలో పాల్గొనలేకపోయానని ప్రకటించిన ముర్రే వింబుల్డన్‌లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. కానీ, అతను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడా? లేడా? అన్న ప్రశ్న అభిమానులను వేధిస్తున్నది. ఫిట్నెస్ సమస్య లేకపోతే, వింబుల్డన్‌లో ముర్రే దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులభం కాదు. ఇక ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను తక్కువ అంచనా ఎవరికైనా వేస్తే దారుణ ఫలితాలను చవిచూడక తప్పదు. క్లే, గ్రాస్, హార్డ్ అనే తేడా లేకుండా ఎలాంటి కోర్టుల్లోనైనా విజృంభించే సత్తా అతనికి ఉంది. మూడు వింబుల్డన్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న అతను మరోసారి సవాళ్లు విసరేందుకు సర్వశక్తు ఒడ్డనున్నాడు. ఈ నలుగురిలో ఒకరికి టైటిల్ దక్కుతుందో లేక ‘అండర్ డాగ్’ ఎవరైనా టైటిల్ ఎగరేసుకుపోతాడో చూడాలి.

చిత్రం.. లండన్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ఫేవరిట్స్‌గా బరిలోకి దిగుతున్న ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్