క్రీడాభూమి

గెలిచేది ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 2: టెన్నిస్‌లో అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా వెలుగుతున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఈసారి టైటిళ్లను ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఆసక్తిని రేపుతున్నది. పురుషుల సింగిల్స్‌లో నలుగురు టాప్ స్టార్లు, ఆండీ ముర్రే, నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ పోటీపడుతుండగా, ఒక్కోసారి ఒక్కొక్కరు రాణిస్తున్న నేపథ్యంలో ఎవరినీ హాట్ ఫేవరిట్‌గా పేర్కోవడానికి వీల్లేని పరిస్థితి. మహిళల విభాగంలో సెరెనా
విలియమ్స్, మరియా షరపోవా ఈసారి ఆడడం లేదు. దీనితో మహిళల టైటిల్‌ను సాధించే అవకాశాలపై ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. నిరుడు సెమీ ఫైనల్‌లో ఓటమిపాలై నిష్క్రమించిన 35 ఏళ్ల స్విస్ వీరుడు ఫెదరర్ కెరీర్‌లో 18 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో రికార్డు సృష్టించాడు. వింబుల్డన్‌లో ఏడు పర్యాయాలు విజేతగా నిలిచి, ఎనిమిదో టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాడు. అతనికి ముర్రే, జొకోవిచ్ నుంచి గట్టిపోటీ తప్పదు. నాదల్ పోటీపడుతున్నప్పటికీ, అతను ‘క్లే కోర్టు స్పెషలిస్టు’గా ముద్ర పడ్డాడు. తనకు అంతగా అచ్చిరాని గ్రాస్ కోర్టుపై ఏ స్థాయిలో ఆడతాడో చూడాలి. అయితే, 2008, 2010 సంవత్సరాల్లో విజయభేరి మోగించిన అతనిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాగా, 2003లో మొదటిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన ఫెదరర్ ఆతర్వాత వరుసగా మరో నాలుగుసార్లు టైటిల్‌ను స్వీకరించాడు. 2008లో నాదల్ విజయం సాధిస్తే, 2009 లో మరోసారి ఫెదరర్‌కే టైటిల్ దక్కింది. 2010లో నాదల్, 2011లో జొకోవిచ్ టైటిళ్లు అందుకున్నారు. 2012లో మరోసారి ఫెదరర్ సత్తా చాటాడు. 2013లో ఆండీ ముర్రే గెలిస్తే, 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండేళ్లు చాంపియన్‌గా నిలిచాడు. నిరుడు ముర్రే టైటిల్ కైవసం చేసుకొని, స్వదేశంలో అభిమానులను అలరించాడు. 2003 నుంచి 2016 వరకు మొత్తం 14 సంవత్సరాల్లో వింబుల్డన్ టైటిల్‌ను నలుగురు ఆటగాళ్లే పంచుకోవడం విశేషం. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇలావుంటే, చెప్పడానికి నలుగురు టాప్ స్టార్లు ఫేవరిట్స్‌గా ఉన్నప్పటికీ, జర్మనీకి చెందిన 20 ఏళ్ల సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ వారిని భయపెడుతున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-10’లోకి దూసుకెళ్లిన అతను ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నప్పటికీ, ఇటీవలే రోమ్ మాస్టర్స్ ఫైనల్‌లో జొకోవిచ్‌ను ఓడించి కెరీర్‌లో మొదటి మాస్టర్స్ టైటిల్ సాధించాడు. ఫైనల్ చేరే క్రమంలో అతను తన కంటే మెరుగైన స్థానాల్లో ఉన్న మిలోస్ రోనిక్, జాన్ ఇస్నర్‌ను ఓడించాడు. హాలే టోర్నీలో అతను ఫెదరర్ చేతిలో ఓడాడు.
అయితే, ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అలవాటున్న జ్వెరెవ్ వింబుల్డన్‌లో టాప్ స్టార్ల సామర్థ్యానికి పరీక్ష పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనితోపాటు నిక్ కిర్గియోస్, గ్రిగర్ దిమిత్రోవ్, లుకాస్ పౌలీ, కెరెన్ కచనోవ్ వంటి యువ ఆటగాళ్లు కూడా గట్టిపోటీని ఇవ్వనున్నారు. వీరిలో ఎవరైనా, ఎప్పుడైనా సంచలనాలు సృష్టించవచ్చు. ఎంతటి స్టార్లకైనా ఇంటిదారి చూపించవచ్చు. అందుకే, ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంలో ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.