క్రీడాభూమి

వింబుల్డన్ టెన్నిస్ ఆవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్ టెన్నిస్ ఆవరణ 13.5 ఎకరాలు విస్తరించింది. పార్కింగ్ కోసం అదనంగా 42 ఎకరాల స్థలం ఉంది. వింబుల్డన్ కోర్టులన్నింటినీ అనుక్షణం క్షుణ్ణంగా వీక్షిస్తూ, ఏ చిన్నపాటి కదిలికనైనా రికార్డు చేయడానికి ‘హాక్ ఐ’ పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. గాల్లో తేలుతూ ఉండే ఈ కెమెరాల దృష్టిని దాటుకొని వింబుల్డన్ కోర్టులపై చీమ కూడా కదల్లేదు. మ్యాచ్‌లను కవర్ చేయడానికి 3,250 మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులు వస్తారు. వీరిలో 200 మంది ఫొటోగ్రాఫర్లు.

వింబుల్డన్ లాన్ టెన్నిస్ క్లబ్‌లో 375 మందికి శాశ్వత సభ్యత్వం ఉంది. వీరికి మ్యాచ్‌లు తిలకించేందుకు వొర్పల్ రోడ్ స్టాండ్‌ను కేటాయిస్తారు. అన్ని వసతులు కల్పిస్తారు. కాగా, ఏటా 120 మంది తాత్కాలిక సభ్యులను ఎంపిక చేస్తారు. శాశ్వత సభ్యత్వం ఉన్న కనీసం నలుగురు ప్రతిపాదిస్తేనే, ఒక వ్యక్తి తాత్కాలిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, ఈ విధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1000కిపైగా ఉంది.