క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్ అస్టాపెన్కో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత సెరెనా విలియమ్స్ ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తల్లికానున్నందున ఈసారి పోటీకి దిగడం లేదు. మరో స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా కాలి కండరాల నొప్పితో విశ్రాంతి తీసుకుంటున్నది. వీరిద్దరూ లేకపోవడంతో, ఈసారి మహిళల విభాగంలో పోరు ఆసక్తికరంగా సాగనుంది. సంవత్సరంలో మొదటి గ్రాండ్ శ్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను సెరెనా కైవసం చేసుకోగా, ఫ్రెంచ్ ఓపెన్‌ను యువ క్రీడాకారిణి జెలెనా అస్టాపెన్కో గెల్చుకుంది. దీనితో వింబుల్డన్‌లో ఆమె స్టార్ అట్రాక్షన్‌గా మారింది. ఫ్రెంచ్ ఓపెన్ ముందు వరకూ ఎవరికీ అంతగా పరిచయం లేని ఈ లాత్వియా క్రీడాకారిణికి ఇప్పుడు అందరికీ సుపరచితురాలు. 20 ఏళ్ల వయసులో ప్రపంచ 13వ ర్యాంక్‌ను అందుకున్న ఆమె వింబుల్డన్‌లోనూ ప్రతిభ కనబరుస్తుందని విశే్లషకుల అంచనా. 2014లో వింబుల్డన్ జూనియర్స్ విభాగంలో టైటిల్ సాధించిన ఆమె సీనియర్స్ విభాగంలోనూ అదే ఫలితాన్ని ఆశిస్తున్నది. కాగా, ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్, ఎంజెలిక్ కెర్బర్, పెట్రా క్విటోవా, ఎకతరీన మకరొవా తదితరులు కూడా టైటిల్ కోసం పోరాడనున్నారు.

చిత్రం.. జెలెనా అస్టాపెన్కో