క్రీడాభూమి

వింబుల్డన్‌లో వీనస్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 3: ఇటీవల కారు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతికి కారకురాలైనందుకు న్యాయస్థానంలో కేసును ఎదుర్కొంటున్న అమెరికా టెన్నిస్ తార వీనస్ విలిమయమ్స్ (37) ఆ వత్తిడి నుంచి బయటపడి ఆటపై మళ్లీ దృష్టి సారించగలిగింది. దీంతో ఆమెకు వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్‌లో శుభారంభం లభించింది. ఈ టోర్నీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన వీనస్ విలియమ్స్ మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 7-6, 6-4 తేడాతో ఎలిసీ మెర్టెన్స్‌ను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. గత నెలలో వీనస్ విలియమ్స్ నడుపుతున్న కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వీనస్‌పై కేసు దాఖలైన విషయం తెలిసిందే.
నాదల్ ఖాతాలో 850వ విజయం
కాగా, పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే, ‘స్పెయన్ బుల్’ రాఫెల్ నాదల్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ముర్రే 6-1, 6-4, 6-2 తేడాతో కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బబ్లిక్‌ను మట్టికరిపించగా, నాదల్ 6-1, 6-3, 6-2 తేడాతో ఆస్ట్రేలియాకి చెందిన జాన్ మిల్లిమన్‌ను చిత్తు చేశాడు. వింబుల్డన్ టోర్నీలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన నాదల్‌కు కెరీర్‌లో ఇది 850వ విజయం. దీంతో అతను ఈ మైలురాయని అధిగమించిన ఏడో ఆటగాడిగా ఆవిర్భవించి రోజర్ ఫెదరర్, జిమీ కానర్స్ ఇవాన్ లెండిల్, జాన్ మెకెన్రో, ఆండ్రూ అగస్సీ, గులెర్మో విల్లాస్ సరసన నిలిచాడు.
వైదొలిగిన కిర్గియోస్
ఇదిలావుంటే, గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ వింబుల్డన్ టోర్నీ ఆరంభంలోనే అర్ధాంతరంగా నిష్క్రమించాడు. సోమవారం ఇక్కడ పియెర్రీ హ్యూజెస్ హెర్బర్ట్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో 6-3, 6-4 తేడాతో వరుసగా రెండు సెట్లను కోల్పోయిన కిర్గియోస్‌ను ఆ తర్వాత గాయం మరింత బాధించింది. దీంతో అతను ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.