క్రీడాభూమి

గత 16 ఏళ్లలో ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 3: కరీబియన్లతో ఐదు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా సోమవారం ఆంటిగ్వాలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా అప్పటికి 45 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. 46వ ఓవర్‌లో విండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ వేసిన తొలి బంతికి ఒక పరుగు రాబట్టుకోవడం ద్వారా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఎంతో గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా పేరు పొందిన ధోనీ ఈ మ్యాచ్‌లో చాలా చెత్తగా ఆడి అభిమానులను తీవ్రమైన నిరుత్సాహానికి గురిచేశాడు. 108 బంతులను ఎదుర్కొన్న తర్వాత అతను ఈ అర్ధ శతకాన్ని సాధించాడు. ధోనీ తన సుదీర్ఘ కెరీర్‌లో అత్యంత మందకొడిగా సాధించిన అర్ధ శతకం ఇదే. గత 16 ఏళ్లలో భారత్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మన్ కూడా ఆడనంత పరమ చెత్తగా ఆడి ధోనీ ఈ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ‘రికార్డు’ అర్ధ శతకం సాధించిన తర్వాత మరో 6 బంతులు ఆడి 4 పరుగులు సాధించిన ధోనీ మొత్తం మీద 114 బంతులను ఎదుర్కొని 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ గతంలో ఎన్నడూ లేనంత మందకొడిగా ఆడటంతో భారత జట్టు 190 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా అధిగమించలేకపోయింది. విండీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ధోనీతో పాటు టాప్ ఆర్డర్‌లో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ కూడా ఘోరంగా విఫలమవడంతో 49.4 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు 11 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

చిత్రం.. 114 బంతుల్లో 54 పరుగులు సాధించిన మహేంద్రుడు