క్రీడాభూమి

గోస్వామే స్ఫూర్తి : ఇంతియాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకుని ఉండవచ్చు. అయితే ఈ రెండు దేశాల మధ్య స్నేహవారధులను నిర్మించే ఓ అత్యుత్తమ మార్గంగా ఉపయోగపడుతానని క్రికెట్ మరోసారి రుజువు చేసింది.ఈ మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో సైతం ఈ విషయం రుజువైంది. తాజాగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసిసి మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న పాక్ జట్టు సభ్యురాలు కైనత్ ఇంతియాజ్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచిన ఓ ఫోటో ఈ విషయానికి ఓ చక్కటి ఉదాహరణగా నిలిచింది. భారత మహిళా జట్టులో ఫాస్ట్‌బౌలర్ ఝూలన్ గోస్వామితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఇంతియజ్, తాను క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడానికి గోస్వామే కారణమని కూడా పేర్కొంది. 2005లో ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ పాకిస్తాన్‌లో జరిగినప్పుడు అప్పట్లో ఫాసెస్ట్ మహిళా ఫాస్ట్‌బౌలర్ అయిన గోస్వామిని తాను తొలిసారిగా చూసినట్లు ఇంతియాజ్ తెలిపింది. అప్పట్లో తాను బాల్ అందించే దాన్నని చెప్పిన ఆమె గోస్వామిని చూసిన తర్వాతే తాను క్రికెట్‌ను అది కూడా ఫాస్ట్‌బౌలింగ్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలని నిర్ణయించున్నానని చెప్పింది. 12 ఏళ్ల తర్వాత తిరిగి ఝూలన్ నేరుగా గోస్వామిని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఒక వరల్డ్ కప్ మ్యాచ్‌లో గోస్వామికి ప్రత్యర్థిగా ఆడుతున్నందుకు కూడా గర్వంగా ఉందని తెలిపింది.

చిత్రం.. ఝూలన్‌తో పాక్ క్రీడాకారిణి ఇంతియాజ్