క్రీడాభూమి

పాక్ టెస్టు జట్టుకూ సర్‌ఫ్రాజే కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 4: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇకమీదట అన్ని ఫార్మాట్లలోనూ సర్‌ఫ్రాజ్ అహ్మద్ సారథిగా వ్యవహరించనున్నాడు. వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్‌గా సేవలు అందిస్తున్న సర్‌ఫ్రాజ్ గత నెల ఇంగ్లాండ్‌లో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టును విజయ పథంలో నడిపించడంతో పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) అతనికి టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించిన పాకిస్తాన్ జట్టును సత్కరించేందుకు ఇస్లామాబాద్‌లోని ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. సర్‌ఫ్రాజ్ అహ్మద్ ఇప్పటికే పాకిస్తాన్ టి-20 జట్టుతో పాటు వనే్డ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఇప్పటివరకూ 32 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సర్‌ఫ్రాజ్ అహ్మద్ 40.96 సగటుతో మొత్తం 2,089 పరుగులు సాధించాడు. వీటిలో మూడు శతకాలు, మరో 13 అర్ధ శతకాలు ఉన్నాయి.