క్రీడాభూమి

నాలుగున్నర నెలల గర్భవతి అయనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 4: లక్సెంబర్గ్‌కు చెందిన మాండీ మినెల్లా నాలుగున్నర నెలల గర్భంతో వింబుల్డన్‌లో ఆడడం ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకొంది. తల్లులు కాబోతున్న, ఇప్పటికే తల్లులు అయిన టెన్నిస్ తారలు సెరీనా విలియమ్స్, విక్టోరియా అజరెన్కాల సరసన 31 ఏళ్ల మినెల్లా కూడా త్వరలోనే చేరబోతోంది. మినెల్లా సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఇటలీకి చెందిన ప్రానె్సస్కా షియవోన్ చేతిలో 6-1, 6-1 స్కోరుతో వరస సెట్లలో పరాజయం పాలయింది. అయితే ఎత్తుగా కనిపిస్తున్న పొట్టను కవర్ చేయడానికి వదులైన దుస్తులు వేసుకుని ఆడడం ద్వారా ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సీజన్‌లో వింబుల్డన్ తన చివరి టోర్నమెంట్ అని మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ మినెల్లా చెప్పింది. కాగా, వింబుల్డన్ కోర్టులో తన భర్త, కోచ్ టిమ్ సొమ్మర్ మోకాళ్లపై కూర్చుని తన పొట్టను ముద్దాడుతున్న ఒక ఫోటోను మంగవారం ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ప్రపంచ టెన్నిస్‌లో సింగిల్స్‌లో 82వ ర్యాంక్‌లో ఉన్న మినెల్లా లాత్వియాకు చెందిన అనస్టాసిజా సెవస్టోవాతో కలిసి మహిళల డబుల్స్‌లో కూడా ఆడనుంది. వచ్చే సెప్టెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనున్న కారణంగా సెరెనా విలియమ్స్ ఈ ఏడాది వింబుల్డన్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే, గత డిసెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన అజరెన్కా గత నెలలోనే తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టంది. కాగా, సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో ఆమె సునాయాసంగా విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.
కెర్బర్ ముందంజ
జర్మనీకి చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్ కూడా సునాయాసంగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆమె 6-4, 6-4 వరుస సెట్ల తేడాతో అమెరికన్ క్వాలిఫయర్ ఇరినా ఫాల్గోనీని మట్టికరిపించింది. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను కైవసం చేసుకోవడంతో పాటు వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్న కెర్బర్ (29) ఈసారి ఈ టోర్నీలోని హాట్ ఫేవరెట్లలో ఒకరుగా ఉంది. రెండో రౌండ్‌లో ఆమె బెల్జియంకు చెందిన కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్‌తో తలపడనుంది. కాగా, మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో అమెరికాకు చెందిన 24వ సీడ్ క్రీడాకారిణి కోకో వాండ్వెఘె 7-5, 6-2 తేడాతో మోనా బర్తెల్‌ను ఓడించగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 166వ స్థానంలో కొనసాగుతున్న అమెరికా క్వాలిఫయర్ అరినా రోడినోవా 3-6, 7-6(8/6), 9-7 తేడాతో రష్యాకి చెందిన 16వ సీడ్ క్రీడాకారిణి అనస్తాసియా పవ్‌లుచెన్కొవాపై సంచలన విజయం సాధించింది. అలాగే 23వ సీడ్‌గా బరిలోకి దిగిన డచ్ క్రీడాకారిణి కికీ బెర్టెన్స్ 7-6(7/4), 7-5 తేడాతో సొరానా క్రిస్టీ (రొమేనియా)ను ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.

చిత్రం.. అందరినీ ఆకర్షించిన మాండీ మినెల్లా