క్రీడాభూమి

కశ్యప్, ప్రణయ్‌లకు పాస్‌పోర్టు కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: అమెరికా, కెనడాల్లో త్వరలోజరగనున్న టోర్నమెంట్‌లో ఆడడం కోసం గురువారం బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమైన బ్యాడ్మింటన్ టాప్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ తదితరులు పాస్‌పోర్టుల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్, అపణయ్, డబుల్స్ స్పెషలిస్టు ఎన్ సిక్కి రెడ్డిలు వారం రోజుల క్రితమే న్యూజిలాండ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారికి ఇంకా పాస్‌పోర్టులు అందలేదు. కాగా, వచ్చే వారం కెనడాలో జరిగే టోర్నమెంట్‌లో ఆడే అవకాశం కోల్పోకుండా ఉండడం కోసం ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కశ్యప్ మంగళవారం ట్విట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్‌కు విజ్ఞప్తి చేశాడు. వారం రోజుల క్రితం న్యూజిలాండ్ వీసా కోసం తాను, ప్రణయ్, సిక్కిలు దరఖాస్తు చేసుకున్నామని, అందువల్ల వెంటనే వీసా ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని కశ్యప్ సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశాడు. కెనడా, యుఎస్ ఓపెన్‌లలో ఆడడం కోసం తాము గురువారం (ఈ నెల 6న) బయలుదేరి వెళ్లాల్సి ఉందని, అందువల్ల ఈ అంశాన్ని వెంటనే పరిష్కరించేలా చూడాలని కూడా అతను ఆమెకు విజ్ఞప్తి చేశాడు. కెనడా హైకమిషన్‌నుంచి తమ పాస్‌పోర్టులు, వీసాలు పొందేందుకు వీలుగా జోక్యం చేసుకోవాలని గత నెలలో కూడా సిక్కి రెడ్డి, ప్రణయ్, సుమీత్ రెడ్డిలు సుష్మాస్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు. అప్పుడు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) రంగంలోకి దిగడంతో ఇండోనేసియా సూపర్ సిరీస్‌లో పాల్గొనడానికి జకార్తా బయలుదేరి వెళ్లడానికి కేవలం ఒక రోజు ముందు వారికి వారి పాస్‌పోర్టులు అందాయి. కెనడా ఓపెన్ ఈ నెల 11నుంచి 16 వరకు జరగనుండగా, యుఎస్ ఓపెన్ 19నుంచి 23 దాకా జరుగుతుంది.