క్రీడాభూమి

ఆసియా యూత్ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూలై 4: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో వరల్డ్ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్‌తో పాటు మరో ఇద్దరు భారతీయులు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. దీంతో మంగళవారం భారత్‌కు ఈ పోటీల్లో మంచి ఫలితాలు లభించాయి. 49 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్ పోరులో సచిన్ ఫిలిప్పీన్స్‌కు చెందిన జేమ్స్ ఇయాన్ సోలిస్‌ను మట్టికరిపించి సత్తా చాటుకున్నాడు. సెమీఫైనల్ బౌట్‌లో అతను థాయిలాండ్‌కు చెందిన పన్మోద్ థిటిసన్‌తో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో థిటిసన్ కిర్గిస్థాన్‌కు చెందిన రుస్తమ్ మరటోవ్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారతీయుల్లో ఇటాష్ మహమ్మద్ ఖాన్, సచిన్ ఖాన్ కూడా ఉన్నారు. 56 కిలోల విభాగంలో ఫిలిప్పీన్స్‌కు చెందిన లారెంట్ పిట్‌ను చిత్తు చేసిన మహమ్మద్ ఖాన్ ఫైనల్ బౌట్‌లో స్థానం కోసం థాయిలాండ్‌కు చెందిన ప్లుయెమ్ వాంగ్‌క్లలాంగ్‌తో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో వాంగ్లక్‌లాంగ్ ఇరాన్‌కు చెందిన అష్కన్ రెజాయిపై గెలుపొందగా, 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో సచిన్ ఖాన్ జపాన్‌కు చెందిన రికు కొండోని మట్టికరిపించాడు. సెమీ ఫైనల్ పోరులో సచిన్ చైనాకు చెందిన జు చావోతో తలపడనున్నాడు. అయితే 91 కిలోల విభాగంలో హిమ్మత్ సింగ్ కజకిస్థాన్‌కు చెందిన డానిలా సెమెనోవ్ చేతిలో ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చాడు. కాగా, ఈ పోటీల్లో నవీన్ బూర (69 కిలోలు), అంకిత్ (60) కిలోలు, హర్ష్‌ప్రీత్ షరావత్ (+91 కిలోలు) ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన విషయం విదితమే. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు ఆరు పతకాలు ఖాయమయ్యాయి.