క్రీడాభూమి

విండీస్‌పై కివీస్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్, జూలై 6: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌ను ఢీకొన్న న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 43 ఓవర్లలో 150 పరుగులకే అలౌటైంది. కిషోనా నైట్ (41), అఫి ప్లెచర్ (23 నాటౌట్), మెరిసా ఎగిలెరా (20), స్ట్ఫానీ టేలర్ (20) కొంత సేపు కివీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయితే, లీ టాహుహు 39 పరుగులకు 3, లీ కాస్పెరెక్ 17 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టడంతో, వారి ప్రయత్నాలు గొప్ప ఫలితాలను ఇవ్వలేదు. అనంతరం న్యూజిలాండ్ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించింది. రాచెల్ ప్రీస్ట్ (90), సూజీ బేట్స్ (40 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ ప్రతిభ కనబరచడంతో న్యూజిలాండ్ మరో 190 బంతులు మిగిలి ఉండగానే, ఎనిమిది వికెట్ల ఆధిక్యంతో గెలిచింది.