క్రీడాభూమి

‘డబుల్స్’కు ప్రోత్సహం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: బాడ్మింటన్ సింగిల్స్ విభాంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా దూసుకెళుతున్నప్పటికీ, డబుల్స్ విభాగంలో చాలా వెనుకబడి ఉందని ఇటీవలే డబుల్స్ కోచ్‌గా నియమితురాలైన జ్వాల గుత్తా తెలిపింది. గురువారం ఆమె పిటిఐతో మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమాంత బిశ్వ శర్మకు కృతజ్ఞతలు తెలిపింది. సింగిల్స్‌కు ఉన్నంత ఆదరణ, ప్రోత్సాహం డబుల్స్ విభాగంలో ఆడే వారికి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. డబుల్స్‌లోనూ మెరికల్లాంటి జోడీలను తయారు చేయడమే తన లక్ష్యమని పేర్కొంది. అటు సింగిల్స్, ఇటు డబుల్స్‌లో రాణించాల్సిన అవసరం ఉందని తెలిపంది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరిఫ్ సలహాలు, సూచనలు తీసుకొని డబుల్స్‌లోనూ భారత్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని జ్వాల చెప్పింది. రిటైర్మెంట్ గురించి తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. తనకు ఫిట్నెస్ సమస్యలు లేవని, టోర్నీల్లో పాల్గొంటానని 33 ఏళ్ల జ్వాల స్పష్టం చేసింది.