క్రీడాభూమి

మూడో రౌండ్‌కు జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 6: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో అతను ఆడం పవ్లాసెక్‌ను 6-2, 6-2, 6-1 తేడాతో సులభంగా ఓడించాడు. 2011, 2014, 2015 సంవత్సరాల్లో వింబుల్డన్ విజేతగా నిలిచిన అతను ఇక్కడ నాలుగవ, మొత్తం మీద కెరీర్‌లో 13వ టైటిల్ వేటను కొనసాగిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ గ్రిగరీ దిమిత్రోవ్ 6-3, 6-2, 6-1 స్కోరుతో మార్కస్ బగ్దాటిస్‌పై విజయం సాధించాడు. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించిన రాఫెల్ నాదల్ 6-4, 6-2 ఆధిక్యంతో డొనాల్డ్ యంగ్‌ను ఓడించి మూడో రౌండ్ చేరాడు.
మహిళల సింగిల్స్‌లో ఏడో ర్యాంక్ క్రీడాకారిణి స్వెటియానా కుజ్నెత్సొవా కూడా మూడో రౌండ్ చేరింది. రష్యాకు చెందిన ఆమె రెండో రౌండ్‌లో తన సహచర క్రీడాకారిణి ఎకతరీన మకరొవాను 6-0, 7-5 తేడాతో ఓడించింది. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో రెండో ర్యాంకర్ సిమోనా హాలెప్ 7-5, 6-3 తేడాతో బీట్రిజ్ హద్దాద్ మసియాపై గెలిచింది.

చిత్రం.. మూడో రౌండ్ చేరిన నొవాక్ జొకోవిచ్