క్రీడాభూమి

టీమిండియాతో జోహ్రి భేటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ జోహ్రి ఇక్కడ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సహచరులను కలిసినట్టు సమాచారం. అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, అతను భారత క్రికెటర్లతో సమావేశమై, వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ విషయంపై బిసిసిఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కింగ్‌స్టన్‌కు జోహ్రి వెళ్లినట్టు బోర్డు అధికారి ఒకరు పిటిఐకి తెలిపాడు. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి (సిఎసి) సూచన మేరకు, పాలనాధికారుల బృందం (సిఒఎ) నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే జొహ్రి వెళ్లినట్టు సదరు అధికారి వివరించాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బిసిసిఐ కోరితేనే తానుగానీ, తన సహచరులుగానీ కోచ్ ఎంపికపై అభిప్రాయాలను వెళ్లడిస్తామని కోహ్లీ ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే కింగ్‌స్టన్‌కు జొహ్రి వెళ్లినట్టు సమాచారం. అతనికి ఆటగాళ్ల నుంచి లభించిన సమాచారంపై ఇంకా వివరాలు తెలియలేదు.