క్రీడాభూమి

మన్‌ప్రీత్‌కు స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూలై 6: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మొదటి రోజున భారత పతకాల ఖాతాను మన్‌ప్రీత్ కౌర్ తెరిచింది. మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో ఆమె 18.28 మీటర్ల దూరానికి విసిరి సత్తా చాటింది. గురువారం 27వ ఏట అడుగుపెట్టిన ఆమె తన పుట్టిన రోజునే స్వర్ణాన్ని అందుకోవడం విశేషం. గవో తియాంక్వియాన్ 17.91 మీటర్లతో రజత పతకం సాధించగా, ఒయా ఒటా 15.45 మీటర్ల దూరంతో కాంస్య పతకాన్ని అందుకుంది. కాగా, పురుషుల డిస్కస్‌త్రోలో భారత వెటరన్ వికాస్ గౌడకు కాంస్య పతకం లభించింది. అతను 60.81 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసిరాడు. ఈ విభాగంలో ఇషాన్ హదాదీ (64.54 మీటర్లు), మహమ్మద్ ఇర్ఫాన్ (60.96 మీటర్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ఇలావుంటే, చాలా విభాగాల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. క్వార్టర్ మైల్ రన్నర్లు రాజీవ్ అరోకియా, మహమ్మద్ అనస్ సెమీ ఫైనల్స్‌లో చేరుకున్నారు. అమోజ్ జాకబ్ కూడా తర్వాతి రౌండ్‌కు క్వాలిఫై అయ్యాడు. పురుషుల 1,500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్ క్వాలిఫయింగ్ రౌండ్‌ను అందరి కంటే ముందుగానే పూర్తి చేసి, ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. సిద్ధార్థ్ అధికారి కూడా ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. మహిళల 1,500 మీటర్ల ఈవెంట్‌లో మోనికా చౌదరి, పియు చిత్ర ఫైనల్ రౌండ్‌కు అర్హత పొందారు. పురుషుల హై జంప్‌లో చేతన్, అజయ్ కుమార్ ప్రిలిమినరీ రౌండ్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

చిత్రం.. మన్‌ప్రీత్ కౌర్