క్రీడాభూమి

భారత రిలే జట్టుపై అనర్హత వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూలై 7: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత 4న100 మీటర్ల రిలే జట్టుపై అనర్హత వేటు పడింది. బాటన్‌ను అందించే సమయంలో ఒక రన్నర్ తన లేన్‌ను కాకుండా మరో లేన్‌లోకి అడుగుపెట్టిన కారణంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 400 మీటర్ల సెమీ ఫైనల్ పరుగును శుక్రవారం మరోసారి నిర్వహించారు. గురువారం భారత రన్నర్ మహమ్మద్ అనాస్ సెమీస్‌ను అందరి కంటే ముందుగా పూర్తి చేశాడు. అయితే, రిఫరీ గన్‌ను నిర్ణీత సమయానికి పేల్చలేకపోవడంతో, కొంత మంది ఇబ్బంది పడ్డారు. అదే రేస్‌ను మళ్లీనిర్వహించారు. ఈసారి కూడా అనాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
రెండో రోజు నాలుగు స్వర్ణాలు
భువనేశ్వర్: భారత్‌కు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ రెండో రోజున నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. క్వార్టర్ మైల్ రేస్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో మహమ్మద్ అనాస్, మహిళల విభాగంలో నిర్మల షెరాన్ స్వర్ణాలను అందుకున్నారు. మహిళల 1,500 మీటర్ల పరుగులో చిత్ర, ఇదే దూరానికి పురుషుల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్ స్వర్ణాలను స్వీకరించారు.
జగ్తార్ సస్పెన్షన్
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్ ప్రతిష్ఠ దెబ్బతీనే రీతిలో డెకాథ్లెట్ జగ్తార్ సింగ్ డోప్ పరీక్షలో పట్టుబడ్డాడు. అతను నిషిద్ధ మెల్డోనియం ఉత్ప్రేరకాన్ని వాడినట్టు గత నెల పటియాలాలో జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ చాంపియన్‌షిప్ సమయంలో తీసుకున్న అతను రక్తం ‘ఎ’ నమూనాలో స్పష్టమైనట్టు భారత డోపింగ్ నిరోధక విభాగం (నాడా) ప్రకటించింది. ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించిన తర్వాత అతను ఏ స్థాయి నేరం చేశాడన్నది నిర్ధారిస్తామని ప్రకటించింది. ఇలావుంటే, డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా జగ్తార్‌పై నిషేధం వేటు పడింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఒకవేళ నేరం రుజువైతే అతనిని నాలుగేళ్లపాటు అన్ని స్థాయిల్లోనూ అథ్లెటిక్స్ పోటీల నుంచి బహిష్కరించే అవకాశం ఉంది.