క్రీడాభూమి

ప్లిస్కోవా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 7: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ నుంచి ఫేవరిట్స్ జాబితాలో ఉన్న కరోలినా ప్లిస్కోవా రెండో రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. సెంట్రల్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 108వ స్థానంలో ఉన్న మగ్దలెన రిబరికొవా 3-6, 7-5, 6-2 తేడాతో ప్లిస్కోవాపై విజయభేరి మోగించి సంచలనం సృష్టించింది. నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్ చేరినప్పటికీ, ఏంజెలిక్ కెర్బర్ చేతిలో ఓటమిపాలైన ప్లిస్కోవా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరింది. అయితే, ఫైనల్‌లో స్థానం సంపాదించలేకపోయింది. వింబుల్డన్‌లో సెరెనా విలియమ్స్, మరియా షరపోవా వంటి స్టార్లు లేకపోవడంతో పాటు ప్రపంచ నంబర్ వన్ కెర్బర్ దారుణంగా విఫలం కావడంతో, టైటిల్ రేసులో ప్లిస్కోవా కూడా చేరింది. విజేతగా నిలిచే సామర్థ్యం ఆమెకు ఉందని క్రీడా పండితులు కూడా జోస్యం చెప్పారు. కానీ, ఆమె మరోసారి వింబుల్డన్‌లో రెండో రౌండ్‌ను అధిగమించలేకపోయింది. ఆరోసారి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడుతున్న ప్లిస్కోవా ఒక్కసారి కూడా మూడో రౌండ్‌లో అడుగుపెట్టలేకపోవడం విచిత్రం. కాగా, రిబరికొవా వింబుల్డన్‌లో మూడో రౌండ్ చేరడం ఇది రెండోసారి. మరో మ్యాచ్‌లో అగ్నీస్కా రద్వాన్‌స్కా 5-7, 7-6, 6-3 స్కోరుతో క్రిస్టియానా మెక్‌హాలెపై గెలుపొందగా, కరోలిన్ వొజ్నియాకి 6-3, 6-4 స్కోరుతో స్టెటానా పిరన్కొవాను ఓడించింది. గార్బెనె ముగురుజా 6-2, 6-4 స్కరుతో యనినా విక్‌మేయర్‌ను వరుస సెట్ల విజయం తో ఇంటిదారి పట్టించింది.
అజరెన్కా ముందడుగు
విక్టోరియా అజరెన్కా మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో ఆమె హీతర్ వాట్సన్‌ను 3-6, 6-1, 6-1 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, తర్వాతి రెండు సెట్లను సునాయాసంగా సొంతం చేసుకుంది. సిమోనా హాలెప్ కూడా ప్రీ క్వార్టర్స్ చేరింది. ఆమె మూడో రౌండ్‌లో పెంగ్ షుయ్‌పై 6-4, 7-6 ఆధిక్యంతో వరుస సెట్లలో గెలిచింది.
ప్రీ క్వార్టర్స్ చేరిన సిలిక్
లండన్: పురుషుల సింగిల్స్‌లో మారిన్ సిలిక్ ప్రీ క్వార్టర్స్ చేరాడు. మూడో రౌండ్‌లో అతను స్టీవ్ జాన్సన్‌ను 6-4, 7-6, 6-4 తేడాతో ఓడించాడు. మరో మ్యాచ్‌లో గిలెస్ ముల్లర్ తన ప్రత్యర్థి ఇజాజ్ బెడెన్‌ను 7-6, 7-5, 6-4 ఆధిక్యంతో అతి కష్టం మీద ఓడించి ముందంజ వేశాడు. రాబర్టో బటిస్టా అగుట్ 6-4, 7-6, 7-6 స్కోరుతో తొమ్మిదో సీడ్ కెయ్ నిషికొరీపై సంచలన విజయం నమోదు చేశాడు. మాజీ చాంపియన్ రోజర్ ఫెదరర్ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అతను రెండో రౌండ్‌లో దుసన్ లజోవిక్‌ను 7-6, 6-3, 6-2 తేడాతో ఓడించి మూడో రౌండ్ చేరాడు. మరో మ్యాచ్‌లో యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 6-4, 6-3 ఆధిక్యంతో ఫ్రానె్సస్ టియాఫోను గెలిచాడు. ఎర్నెస్ట్ గల్బిస్ 6-4, 6-4, 7-6 స్కోరుతో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను, ఆరో సీడ్ మిలోస్ రవోనిక్ 3-6, 7-6, 6-4, 7-5 తేడాతో మిఖయిల్ యూజ్నీని, గేల్ మోన్ఫిల్ 7-6, 6-4, 6-4 ఆధిక్యంతో కేల్ ఎడ్యురాండ్‌ను ఓడించి ముందంజ వేశారు.

చిత్రాలు.. అనూహ్యంగా ఓడిన రోలినా ప్లిస్కోవా
*మగ్దలెన రిబరికొవా * మారిన్ సిలిక్