క్రీడాభూమి

సింధుకు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 7: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత బాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు మారుతీ సుజుకి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆమె అవార్డును స్వీకరించింది. లివింగ్ లెజెండ్‌గా మాజీ రన్నర్ మిల్కా సింగ్, ఉత్తమ కోచ్‌గా గోపీంద్, ఉత్తమ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా గౌరవ్ గిల్ అవార్డులు తీసుకున్నారు. క్రీడలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రత్యేక అవార్డును మ్యాజిక్ బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అదికారి జయంత్ రస్తోగీకి అందించారు. టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా భారత జూనియర్ హాకీ జట్టు తరఫున కెప్టెన్ హర్జీత్ సింగ్ అవార్డును స్వీకరించాడు. అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు పారా అథ్లెట్ దేవేంద్ర జఝారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటిలకు ఎడిటర్స్ అవార్డు లభించింది. క్రీడలకు ఉత్తమ సేవలు అందించినందుకు అరుముగం అవార్డు తీసుకున్నిడు. ఒక మ్యాచ్ లేదా గేమ్ తీరును మార్చేసినందుకు ఇచ్చే ‘గేమ్ చేంజర్ ఆఫ్ ది గేమ్’ అవార్డును లోకేష్ రాహుల్ దక్కించుకున్నాడు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కింద స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు అవార్డును అందచేశారు. క్రీడల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేసినందుకు మిలింద్ సోమన్‌ను అవార్డుకు ఎంపిక చేశారు. మిలింద్ స్థానంలో అతని తల్లి దీపా సోమన్ అవార్డును తీసుకుంది.

చిత్రం.. పివి సింధు