క్రీడాభూమి

కోహ్లీ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్, జూలై 7: విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, అజేయ శతకంతో రాణించడంతో, వెస్టిండీస్‌తో జరిగిన చివరి, ఐదో వనే్డలో 8 వికెట్ల తేడాతో గెల్చుకున్న భారత్ సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. విండీస్ 9 వికెట్లకు 205 పరుగులు చేయగా, భారత్ మరో 79 బంతులు మిగిలి ఉండగానే, అజింక్య రహానే (39), శిఖర్ ధావన్ (4) వికెట్లు కోల్పోయి, లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ హీరో కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా రహానే ఎంపికయ్యాడు.
చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎవిన్ లూయిస్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినప్పటికీ, ఫస్ట్‌డౌన్ ఆటగాడు, తన సోదరుడు షాయ్ హోప్‌తో కలిసి ఓపెనర్ కేల్ హోప్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 50 బంతుల్లో, తొమ్మిది ఫోర్లతో 46 పరుగులు చేసిన అతనిని శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోగా ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. తర్వాతి బంతికే రాస్టన్ చేజ్ (0) ఎల్‌బిగా వెనుదిరగడంతో విండీస్ కష్టాలు మొదలయ్యాయి. కీలక ఇన్నింగ్స్ ఆడి, జట్టును ఆదుకునే సామర్థ్యం ఉన్న జాసన్ మహమ్మద్ ఈ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 39 బంతులు ఎదుర్కొన్న అతను 16 పరుగులు చేసి, కేదార్ జాదవ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, 98 బంతుల్లో, ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసిన షాయ్ హోప్‌ను రహానే క్యాచ్ అందుకోగా మహమ్మద్ షమీ అవుట్ చేశాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ జాసన్ హోల్డన్ (36), రోవ్‌మన్ పావెల్ (31) కొంత సేపు క్రీజ్‌లో నిలదక్కొకునే ప్రయత్నం చేశారు. ఆష్లే నర్స్ (0), దేవేంద్ర బిషూ (6) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. విండీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగా, అల్జారి జోసెఫ్ (3), కేస్రిక్ విలియమ్స్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 48 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్ 53 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్ చెరొక వికెట్ పంచుకున్నారు.
వెస్టిండీస్‌ను ఓడించి, సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి 206 పరుగులను ఛేదించాల్సిన భారత్ ఐదు పరుగుల స్కోరు వద్ద శిఖర్ ధావన్ (4) వికెట్‌ను చేజార్చుకుంది. అల్జారి జోసెఫ్ బౌలింగ్‌లో అతను ఎవిన్ లూయిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో గొప్పగా రాణించిన రహానే ఈ మ్యాచ్‌లో అనుకున్న రీతిలో ఆడలేకపోయాడు. 51 బంతులు ఎదుర్కొన్న అతను ఐదు ఫోర్ల సాయంతో 39 పరుగులు సాధించి, దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 84 పరుగులు. ఆతర్వాత కోహ్లీ, దినేష్ కార్తీక్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, 36.5 ఓవర్లలోనే జట్టును లక్ష్యానికి చేర్చారు. కోహ్లీ 115 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 111 పరుగులు సాధించాడు. దినేష్ కార్తీక్ 52 బంతులు ఎదుర్కొని 50 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఐదు ఫోర్లు ఉన్నాయి. విండీస్ తరఫున అల్జారి జోసెఫ్, దేవేంద్ర బిషూ చెరొక వికెట్ సాధించారు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణం గా రద్దుకాగా, రెండు, మూడు వనే్డల్లో భారత్ గెలిచిన విషయం తెలి సిందే. మూడో మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది.
స్కోరుబోర్డు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఎవిన్ లూయిస్ సి విరాట్ కోహ్లీ బి హార్దిక్ పాండ్య 9, కేల్ హోప్ సి శిఖర్ ధావన్ బి ఉమేష్ యాదవ్ 46, షాయ్ హోప్ సి అజింక్య రహానే బి మహమ్మద్ షమీ 51, రాస్టన్ చేజ్ ఎల్‌బి ఉమేష్ యాదవ్ 0, జాసన్ మహమ్మద్ సి అండ్ బి కేదార్ జాదవ్ 16, జాసన్ హోల్డర్ సి శిఖర్ ధావన్ బి మహమ్మద్ షమీ 36, రోవ్‌మన్ పావెల్ సి ధోనీ బి ఉమేష్ యాదవ్ 31, ఆష్లే నర్స్ సి కుల్దీప్ యాదవ్ బి మహమ్మద్ షమీ 0, దేవేంద్ర బిషూ సి ధోనీ బి మహమ్మద్ షమీ 6, అల్జారి జోసెఫ్ 3 నాటౌట్, కేస్రిక్ విలియమ్స్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 205.
వికెట్ల పతనం: 1-39, 2-76, 3-76, 4-115, 5-163, 6-168, 7-171, 8-182, 9-205.
బౌలింగ్: మహమ్మద్ షమీ 10-0-48-4, ఉమేష్ యాదవ్ 10-1-53-3, హార్దిక్ పాండ్య 6-0-27-1, రవీంద్ర జడేజా 10-1-27-0, కుల్దీప్ యాదవ్ 10-0-36-0, కేదార్ జాదవ్ 4-0-13-1.
భారత్ ఇన్నింగ్స్: అజింక్య రహానే ఎల్‌బి దేవేంద్ర బిషూ 39, శిఖర్ ధావన్ సి ఎవిన్ లూయిస్ బి అల్జారి జోసెఫ్ 4, విరాట్ కోహ్లీ 111 నాటౌట్, దినేష్ కార్తీక్ 50 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (36.5 ఓవర్లలో 2 వికెట్లకు) 206.
వికెట్ల పతనం: 1-5, 2-84.
బౌలింగ్: అల్జారి జోసెఫ్ 7-0-39-1, జాసన్ హోల్డర్ 8-1-35-0, దేవేంద్ర బిషూ 8-0-42-1, కేస్రిక్ విలియమ్స్ 8-0-40-0, ఆష్లే నర్స్ 4-0-34-0, రోవ్‌మన్ పావెల్ 1-0-6-0, రాస్టన్ చేజ్ 0.5-0-9-0.

రెండో స్థానానికి తెండూల్కర్!
కింగ్‌స్టన్: వనే్డల్లో భారత జట్టు ఛేజింగ్‌కు దిగినప్పుడు, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఇన్నాళ్లూ రికార్డు పుస్తకాల్లో మొదటి స్థానంలో ఉన్న సచిన్ తెండూల్కర్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. ఆ స్థానాన్ని చివరి మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ ఆక్రమించాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సచిన్ 232 ఇన్నింగ్స్‌లో 17 సెంచరీలు చేశాడు. అయితే, కోహ్లీ 102 ఇన్నింగ్స్‌లోనే 18వ సారి ఈ విధంగా ఛేజింగ్‌లో శతకాన్ని నమోదు చేశాడు. అతనికి కెరీర్‌లో ఇది 28వ సెంచరీ. కరేబియా పర్యటనలో విండీస్‌పై రెండు సెంచరీ సాధించిన భారత కెప్టెన్‌గా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ హోదాలో కరేబియాలో శతకాన్ని నమోదు చేశాడు. కాగా, కోహ్లీ విండీస్‌లో రెండవ, ఆ జట్టుపై నాలుగో సెంచరీ సాధించాడు.

కరేబియాలో హ్యాట్రిక్
కింగ్‌స్టన్: కరేబియా టూర్‌లో భారత్ హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. 2009లో అక్కడ పర్యటించినప్పుడు సిరీస్‌ను 2-1 తేడాతో సాధించిన టీమిండియా 2011లో 3-2 ఆధిక్యంతో గెలిచింది. తాజా సిరీస్‌ను 3-1 తేడాతో తన ఖాతాలో వేసుకొని, హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. మొత్తం మీద, 2007 జనవరి నుంచి ఇప్పటి వరకూ వెస్టిండీస్‌పై భారత్‌కు వనే్డల్లో ఇది వరుసగా ఏడో విజయం.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా భారత్‌కు 22వ విజయాన్ని అందించాడు. ఇంత వరకూ మొత్తం 30 మ్యాచ్‌ల్లో అతను జట్టుకు నాయకత్వం వహించగా, ఏడుసార్లు మాత్రమే టీమిండియా ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా, విండీస్‌తో కనీసం పది ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మెన్ గణాంకాలను పరిశీలిస్తే, కోహ్లీ 27 మ్యాచ్‌ల్లో 1,387 పరుగులతో నంబర్ వన్‌గా ఉన్నాడు. వనే్డల్లో అతను 23వసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సచిన్ తెండూల్కర్ (62), సౌరవ్ గంగూలీ (31), యువరాజ్ సింగ్ (27) మాత్రమే భారత్ తరఫున వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అతని కంటే ఎక్కువ సార్లు ఈ అవార్డును స్వీకరించారు.

చిత్రం.. విరాట్ కోహ్లీ