క్రీడాభూమి

గేల్‌పైనే విండీస్ ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 8: స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ బ్యాటింగ్ సామర్థ్యంపైనే ఆధారపడి, ఆదివారం భారత్‌తో జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ బరిలోకి దిగనుంది. టి-20 వరల్డ్ కప్‌లో విండీస్‌ను గెలిపించిన కార్లొస్ బ్రాత్‌వెయిట్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో గేల్‌తోపాటు మార్లొస్ సామ్యూల్స్, సునీల్ నారైన్, శామ్యూల్ బద్రీ వంటి స్టార్లు ఉన్నారు. నిరుడు ఫ్లొరిడాలో భారత్‌తో జరిగిన టి-20 మ్యాచ్‌లో విండీస్‌ను ఒక పరుగు తేడాతో గెలిపించిన ఎవిన్ లూయిస్ కూడా జట్టుకు అండగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో లూయిస్ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆదివారం నాటి పోరులోనూ అతను అదే స్థాయిలో రాణిస్తాడని విండీస్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఇటీవల ముగిసిన వనే్డ సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్‌ను అడ్డుకోవడం విండీస్‌కు సులభసాధ్యం కాదన్నది వాస్తవం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ స్వయంగా ఓపెనర్ అవతారం ఎత్తే అవకాశం ఉంది. అతనితోపాటు శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టవచ్చు. వనే్డ సిరీస్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోనీ వంటి సమర్థులు జట్టులో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. కాగితంపై చూస్తే ప్రత్యర్థిపై సులభంగానే గెలిచే సత్తావున్న టీమిండియా మైదానంలోకి దిగిన తర్వాత ఏ విధంగా ఆడుతుందో చూడాలి.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది.

చిత్రం.. క్రిస్ గేల్