క్రీడాభూమి

రబదాపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 8: అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమేగాక, మైదానంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కారణంగా దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబదాపై వేటు పడింది. అతనిని ఒక టెస్టు నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో చోటు చేసుకున్న సంఘటనపై మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ చేసిన ఫిర్యాదుపై ఐసిసి తీవ్రంగా స్పందించింది. తన అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించాడన్న ఆగ్రహంతో రబదా మితిమీరి ప్రవర్తించాడు. పరుష పదజాలాన్ని వాడడమేగాక, నిరసనను వ్యక్తం చేస్తున్న రీతిలో హావభావాలు ప్రదర్శించాడు. ఫీల్డ్ అంపైర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం రిఫరీ జెఫ్ క్రోవ్ ఈ సంఘటనను ఐసిసి దృష్టికి తీసుకెళ్లాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని నిర్ధారణకు వచ్చిన ఐసిసి రబదాను ఒక టెస్టు నుంచి సస్పెండ్ చేసింది. మ్యాచ్ ఫీజులో 15 శాతాన్ని జరిమానాగా విధించింది. సస్పెన్షన్ కారణంగా రబదాకు లార్డ్స్ మైదానంలో గురువారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులో ఆడే అవకాశం ఉండదు.

చిత్రం.. కాగిసో రబదా