క్రీడాభూమి

మారథాన్ మ్యాచ్‌లో నెగ్గిన క్వెర్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్, జూలై 8: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జో విల్‌ఫ్రైడ్ సొంగా, శామ్ క్వెర్రీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ మారథాన్ మ్యాచ్‌లో సొంగాను క్వెర్రీ 2-6, 6-3, 7-6, 6-1, 7-5 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. చివరి వరకూ ఈమ్యాచ్ ఉత్కంఠ రేపింది. మరో మ్యాచ్‌లో మిలోస్ రోనిక్ 7-6, 6-4, 7-5 తేడాతో అల్బర్ట్ రమోస్ వినొలాస్‌పై గెలిచి ముందంజ వేశాడు.
ప్రీ క్వార్టర్స్‌కు కెర్బర్
వింబుల్డన్: మహిళల సింగిల్స్ విభాగంలో నంబర్ వన్ సీడ్ ఏంజెలిక్ కెర్బర్ ప్రీ క్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్‌లో ఆమె షెల్బీ రోజర్స్‌పై 4-6, 7-6, 6-4 ఆధిక్యంతో విజయం సాధించింది. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ కెర్బర్ మిగతా రెండు సెట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో మ్యాచ్‌లో గార్బినె ముగురుజా 6-2, 6-2 తేడాతో సొరానా సిర్‌స్టియాపై గెలిచింది. తొమ్మిదో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా 3-6, 6-4, 6-1 ఆధిక్యంతో టిమియా బిసిన్‌స్కీని ఓడించింది.

చిత్రం.. శామ్ క్వెర్రీ విజయోత్సాహం