క్రీడాభూమి

మెద్వెదెవ్ చర్యపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్: ఒక మహిళా అంపైర్‌పై రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ నాణాన్ని విసిరిన సంఘటనపై వింబుల్డన్ అధికారులు విచారణ చేపట్టారు. వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో స్టానిస్లాస్ వావ్రిన్కాను ఓడించి సంచలనం సృష్టించిన మెద్వెదెవ్ రెండో రౌండ్‌లో బెల్జియం దేశానికి చెందిన క్వాలిఫయర్ రూబెన్ బెమెల్మన్స్ చేతిలో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే అతను తన వాలెట్‌ను తీసి, అందులో ఒక నాణాన్ని మహిళా అంపైర్ మరియానా అల్వెస్‌పై విసిరేశాడు. ఆమె డబ్బును ఆశించి రూబెన్‌కు అనుకూలంగా నిర్ణయాలు ప్రకటించిందనే విషయాన్ని అతను పరోక్షంగా చెప్పాడు. ఆతర్వాత నింపాదిగా ఆలోచించి, విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ క్షమాపణ చెప్పాడు. తాను అంపైర్‌ను కించ పరచాలని అనుకోలేదన్నాడు. క్షణికావేశంలో అలా చేశానని వివరణ ఇచ్చాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. వింబుల్డన్ అధికారులు మెద్వెదెవ్ చర్యను తీవ్రంగా పరిగణించి, విచారణకు ఆదేశించారు. అతనిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉన్నాయ.