క్రీడాభూమి

ఇవేం కోర్టులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 8: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి క్షణం సమీక్షిస్తునే ఉంటారు. అధికారులు ఎంత కష్టపడుతున్నా జరగాల్సిన నష్టం జరిగింది. 17వ నంబర్ కోర్టులో సొరానా సిర్‌స్టియాతో జరిగిన మ్యాచ్‌లో బంతిని ఆడేందుకు వేగంగా ముందుకు వెళ్లిన బెథానీ మాటెక్ సాండ్స్ పట్టుకోల్పోయి కింద పడింది. మోకాలుకు తీవ్రమైన గాయం కావడంతో, ‘రక్షించండి’ అంటూ పెద్దగా కేకలు వేసింది. బాధతో విలవిల్లాడింది. అధికారులు వెంటనే ఆమెను స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లి, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన వింబుల్డన్‌లో ఆడుతున్న ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కోర్టుల తీరు అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా మాటెక్ సాండ్స్ గాయపడిన విధానాన్ని ప్రతి ఒక్కరూ చూపుతున్నారు. బ్రిటన్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే కూడా వింబుల్డన్‌లోని గ్రాస్ కోర్టులను పోటీలకు అనువుగా తీర్చిదిద్దలేదంటూ మండిపడ్డాడు. గుంటలను పూడ్చలేదని, కొన్ని చోట్ల పచ్చిక కింద నీరుచేరి జారుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కడ గాయపడతామోనన్న భయంతో మ్యాచ్‌లు ఆడడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. చాలా మంది అతనితో గొంతు కలుపుతున్నారు. ఇవేమి కోర్టులంటూ, నిర్వాహకులను నిలదీస్తున్నారు.

చిత్రం.. బాధతో అల్లాడుతున్న బెథానీ మాటెక్ సాండ్స్