క్రీడాభూమి

ఆ నిర్ణయం దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసనే్న, జూలై 9: టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా నిర్వహించే ప్రో లీగ్ నుంచి భారత్ వైదొలగడంపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) విచారం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం దురదృష్టకరమని ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. 2019 జనవరిలో హాకీ ప్రో లీగ్ మొదలై, జూన్ మాసంతో ముగుస్తుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొదటి నాలుగు స్థానాలను సంపాదించిన జట్లకు ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభిస్తుంది. అయితే, మహిళల విభాగంలో భారత ర్యాంక్ చాలా తక్కువగా ఉంది. ఈ టోర్నీలో ఆడడం ద్వారా ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం కష్టమని హాకీ ఇండియా (హెచ్‌ఐ) అభిప్రాయం. ఇదే విషయాన్ని పేర్కొంటూ, ప్రో లీగ్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. నిబంధనల ప్రకారం టోర్నీలో అటు పురుషులు, ఇటు మహిళల జట్లను బరిలోకి దించాల్సి ఉంటుంది. మహిళల జట్టును పంపకుండా, పురుషుల జట్టును పంపేందుకు వీల్లేదు కాబట్టి, మొత్తంగా టోర్నీకి దూరమవుతున్నట్టు ఎఫ్‌ఐహెచ్‌కి వివరించింది. వరల్డ్ లీగ్ పోటీల్లో రాణించడం ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించే అవకాశం ఉందని, దానిని వినియోగించుకుంటామని తెలిపింది. కాగా, భారత్ వంటి బలమైన దేశం ప్రో లీగ్ నుంచి తప్పుకోవడం బాధాకరమని ఎఫ్‌ఐహెచ్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ టోర్నీలో ఆడేందుకు చాలా దేశాలు దరఖాస్తు చేసుకున్నాయని, భారత్ స్థానంలో మరో జట్టును ఎంపిక చేస్తామని తెలిపింది.