క్రీడాభూమి

లంకపై విండీస్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూలై 9: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆది వారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వి ఫలమైన్ర శ్రీలంక 48 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. తొలు త బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు మెరిసా అగులెరెరా (46 నాటౌట్) అండగా నిలిచింది. దియేంద్ర డోటిన్ 38 పరుగులతో రాణించింది. లంక బౌలర్లలో శ్రీపాలి వీరకోడి 38 పరుగులకు మూడు వికెట్లు పడగొ ట్టింది. ఇనోకా రణవీర, అమా కాంచన చెరి రెండు వికెట్లు సాధిం చారు. ఆతర్వాత లంక పరుగుల వేటలో విఫలమై, ఇంకా రెండు ఓ వర్లు మిగిలి ఉండగానే ఆలౌటైంది. శశికళ సిరివర్దనే 33 పరుగుల తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. బౌలింగ్‌లో రాణించి, మూడు వికె ట్టు సాధించిన శ్రీపాలి వీరకోడి బ్యాటింగ్‌లోనూ ప్రతిభ కనబరచి, 30 పరుగులు చేసింది. మిగతా వారు విఫలం కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. అనీసా మహమ్మద్ 3 వికెట్లు పడగొట్టింది.