క్రీడాభూమి

మోయన్ అలీ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెర్బీ, జూలై 9: మోయన్ అలీ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించడంతో, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 211 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించిం ది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 458 పరుగులు సాధించగా, దక్షిణాఫ్రికా 361 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేసిన ఇంగ్లాండ్ తన ప్రత్య ర్థి ముందు 331 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అలిస్టర్ కుక్ (69), జానీ బెయర్ స్టో (51) అర్ధ శతకాలు సాధించడంతో ఇంగ్లాండ్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. విజయాని కి అవసరమైన 331 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమై, 36.4 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. టెంబా బవూమా 21 పరుగుల తో టాప్ స్కోరర్‌గా నిలవడం ఆ జట్టు వైఫల్యాలకు అద్దం పడుతుంది. మోయన్ అలీ 53 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్‌ను గెలిపించాడు.