క్రీడాభూమి

ఎవరితోనూ నాకు పోటీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9 తాను ఎవరికీ పోటీదారుడ్ని కానని టీమిండియా కోచ్ పదవి రేసులో ఉన్న మాజీ టెస్టు క్రికెటర్ లాల్ చంద్ రాజ్‌పుత్ స్పష్టం చేశాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, తనతోపాటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నాడు. గతంలో జట్టుకు డైరెక్టర్‌గా సేవలు అందించిన రవి శాస్ర్తీ, మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని రాజ్‌పుత్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, తనకు ఎవరితోనూ పోటీ లేదని వ్యాఖ్యానించాడు. 2007లో కోచ్ గ్రెగ్ చాపెల్, కెప్టెన్ సౌరవ్ గంగూలీ మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరినప్పుడు జట్టు మేనేజర్‌గా తనను నియమించడాన్ని అతను గుర్తుచేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన టి-20 వరల్డ్ కప్ ఆరంభానికి కొన్ని రోజుల ముందే తనను మేనేజర్‌గా నియమించారని, నిజానికి జట్టుతో కలవడానికి, ఆటగాళ్ల సామర్థ్యాన్ని, తీరుతెన్నులను తెలుసుకోవడానికి తగినంత సమయం లేకపోయినప్పటికీ, బిసిసిఐ తనకు అప్పగించిన పనిని చేపట్టానని చెప్పాడు. జట్టు ఒకేతాటిపై నడిచేలా కృషి చేశానని అంటూ, ఆ టోర్నీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ టైటిల్ సాధించిన విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించాడు. తాను మేనేజర్‌గా ఉన్న కాలంలోనే భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై టెస్ట సిరీస్‌ను సాధించింది. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు వనే్డ క్రికెట్ సిరీస్‌లోనూ టీమిండియా విజయభేరి మోగించింది. కోచ్‌గా ఎంపికైతే తాను ఏం చేయగలనో చెప్పడానికి నాటి టీమిండియా విజయాలే నిదర్శనమని పేర్కొన్నాడు. కోచ్‌గా అతని మార్గదర్శకంలోనే అఫ్గానిస్తాన్ జట్టు అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్నది. ఆ జట్టుకు ఇటీవలే టెస్టు హోదా కూడా లభించడం విశేషం. కొచ్‌గా ఆటగాళ్ల సామర్థ్యాన్ని వెలికితీసి, అత్యుత్తమ ఫలితాలను రాబట్టడంలో తనకు తగినంత అనుభవం ఉందని, అందుకే టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నానని రాజ్‌పుత్ అన్నాడు.

చిత్రం.. లాల్ చంద్ రాజ్‌పుత్