క్రీడాభూమి

తమిళనాడు విద్యుత్ శాఖలో చిన్నప్పకు ఉద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 11: ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి జోత్స్న చిన్నప్పకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ కార్పొరేషన్ (టిఎఎన్‌జిఇడిసిఓ)లో ఆమెను సీనియర్ స్పోర్ట్స్ అధికారిగా నియమించింది. ముఖ్యమంత్రి కె.పళనిస్వామి మంగళవారం చెన్నైలోని సచివాలయంలో ఆమెకు ఈ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారని తమిళనాడు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. క్రీడల కోటాలో తనకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా జోత్స్న చిన్నప్ప విజ్ఞప్తి చేసుకోవడంతో ఆమెను నేరుగా ఈ ఉద్యోగంలో నియమించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. కెరీర్‌లో ఇప్పటివరకూ ఏడు టైటిళ్లు సాధించిన చిన్నప్ప గత ఏప్రిల్‌లో ఇక్కడ ఆసియా వ్యక్తిగత స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో మహిళల టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు ఈ ఏడాది ఆరంభంలో ఈజిప్టులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే కామనె్వల్త్ క్రీడల్లో ఆమె దీపికా పల్లికల్‌తో కలసి మహిళల డబుల్స్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.
అథ్లెట్లకు నగదు పురస్కారాలు
ఇదిలావుంటే, భువనేశ్వర్‌లో ఆదివారం ముగిసిన ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించారు. 5 వేల మీటర్లతో పాటు 10 వేల మీటర్ల పరుగు ఈవెంట్లలో పసిడి పతకాలను కైవసం చేసుకున్న పుదుకొట్టై రన్నర్ జి.లక్ష్మణన్‌కు రూ.20 లక్షలు, 400 మీటర్ల పరుగు పోటీలో రజత పతకాన్ని గెలుచుకోవడంతో పాటు 400 మీటర్ల రిలే పరుగు పోటీలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నా ఆరోకియా రాజీవ్‌కు రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతులను అందజేయనున్నట్లు పళనిస్వామి సోమవారం తమిళనాడు శాసనసభకు తెలియజేశారు.

చిత్రం.. జోత్స్న చిన్నప్ప