క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రెంట్‌బ్రిడ్జి, జూలై 17: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టును దక్షిణాఫ్రికా 340 పరుగుల భారీ ఆధిక్యంతో సొంతం చేసుకుంది. అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 133 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచిన వెర్నన్ ఫిలాండర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరొక విజయంతో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెచిండో టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌటైంది. షహీం ఆమ్లా (78), క్వింటన్ డి కాక్ (68), వెర్నన్ ఫిలాండర్ (54) అర్ధ శతకాలతో రాణించారు. ఇంగ్లాండ్ ఫేసర్ జేమ్స్ ఆండర్సన్ 72 పరుగులకు ఐదు వికెట్లు పడగొటాటడు. స్టువర్ట్ బ్రాడ్ మూడు, బెన్ స్టోక్స్ రెండు చొప్పున వికెట్లు సాధించారు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ ఒంటరి పోరాటం సాగించి 78 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో (45) మినహా మిగతా వారు రాణించలేకపోవడంతో, తన ప్రత్యర్థి కంటే ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 130 పరుగులు వెనుకబడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్ 38 పరుగులకు 3, కేశవ్ మహారాజ్ 21 పరుగులకు 3 చొప్పున వికెట్లు పడగొట్టగా, మోర్న్ మోర్కెల్, వెర్నన్ ఫిలాండర్ చెరి రెండు వికెట్లు సాధించారు. అనంతరం, మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా 104 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 343 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. డీన్ ఎల్గార్ 80, షహీం ఆమ్లా 87, ఫఫ్ డు ప్లెసిస్ 63, వెర్నన్ ఫిలాండర్ 42 చొప్పున పరుగులు సాధించారు. మోయిన్ అలీ 78 పరుగులకు నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, జేమ్స్ ఆండర్సన్, బెన్ స్టోక్స్ చెరి 2 వికెట్లు పడగొట్టారు.
ఒత్తిడిలో తడబాటు
విజయానికి 474 పరుగులు సాధించాల్సి ఇంగ్లాండ్ తీవ్రమైన ఒత్తిడికిలోనై, అనవసరమైన పొరపాట్లు చేసి పరువు పోగొట్టుకుంది. అలస్టర్ కుక్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, రెండో బెస్ట్ స్కోరు మోయిన్ అలీ చేసిన 27 పరుగులు. దీనిని బట్టి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో విఫలమయ్యారో అర్థమవుతుంది. 44.2 ఓవర్లలో ఇంగ్లాండ్ కేవలం 133 పరుగులకు చేతులెత్తేసింది. వెర్నర్ ఫిలాండర్ 24 పరుగులకు మూడు, కేశవ్ మహారాజ్ 42 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చారు. డానే ఒలివియర్, క్రిస్ మోరిస్ చెరి రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరచి, దక్షిణాఫ్రికా విజయంలో కీలక భూమిక పోషించిన వెర్నన్ ఫిలాండర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 96.2 ఓవర్లలో 335 ఆలౌట్ (షహీం ఆమ్లా 78, క్వింటన్ డి కాక్ 68, వెర్నన్ ఫిలాండర్ 54, జేమ్స్ ఆండర్సన్ 5.72, స్టువర్ట్ బ్రాడ్ 3.64, బెన్ స్టోక్స్ 2.77).
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 51.5 ఓవర్లలో 205 ఆలౌట్ (జో రూట్ 78, జానీ బెయిర్‌స్టో 45, క్రిస్ మోరిస్ 3/38, కేశవ్ మహారాజ్ 3-21, మోర్న్ మోర్కెల్ 2/45, వెర్నన్ ఫిలాండర్ 2/48).
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 104 ఓవర్లలో 9 వికెట్లకు 343 డిక్లేర్డ్ (డీన్ ఎల్గార్ 80, షహీం ఆమ్లా 87, ఫఫ్ డు ప్లెసిస్ 63, ఫిలాండర్ 42, మోయిన్ అలీ 4/78, జేమ్స్ ఆండర్సన్ 2/45, బెన్ స్టోక్స్ 2/34).
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 474): 44.2 ఓవర్లలో 133 ఆలౌట్ (అలస్టర్ కుక్ 42, మోయిన్ అలీ 27, వెర్నన్ ఫిలాండర్ 3/24, కేశవ్ మహారాజ్ 3/42, డానే ఒలివియర్ 2/25, క్రిస్ మోరిస్ 2/7).