క్రీడాభూమి

క్వార్టర్స్‌కు ప్రణయ్, సౌరభ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, ఆగస్టు 3: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన నాలుగో సీడ్ ఆటగాడు హెచ్‌ఎస్.ప్రణయ్, నేషనల్ చాంపియన్ సౌరభ్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గత నెలలో యుఎస్ ఓపెన్ టైటిల్‌తో సత్తా చాటుకున్న ప్రణయ్ గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో హాంకాంగ్‌కు చెందిన పదో సీడ్ ఆటగాడు వెయ్ నాన్‌ను వరుస గేముల తేడాతో మట్టికరిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించిన ప్రణయ్ 21-18, 21-19 తేడాతో ప్రత్యర్థిని 46 నిమిషాల్లోనే చిత్తు చేశాడు. దీంతో 2014లో జరిగిన మలేషియా ఓపెన్ టోర్నీలో వెయ్ నాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రణయ్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. సెమీస్‌లో స్థానం కోసం ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన 11వ సీడ్ ఆటగాడు లిన్ యు సియెన్‌తో తలపడనున్నాడు. ఈ టోర్నీలో ప్రణయ్‌తో పాటు భారత్‌కు చెందిన ఏడో సీడ్ ఆటగాడు సౌరభ్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌తో 64 నిమిషాల పాటు జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో సౌరభ్ 21-18, 13-21, 21-16 గేముల తేడాతో విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో అతను ఇజ్రాయిల్‌కు చెందిన మిషా జిల్బెర్మన్‌తో గానీ లేక హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యుతో గానీ తలపడతాడు. ఇదిలావుంటే, ఈ టోర్నీలో భారత్‌కు చెందిన సిరిల్ వర్మ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో అతను 13-21, 14-21 గేముల తేడాతో చైనీస్ తైపీకి చెందిన చియా హంగ్ లు చేతిలో ఓటమిపాలై ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు.

చిత్రం.. మరో టైటిల్ వేటలో దూసుకెళ్తున్న హెచ్‌ఎస్.ప్రణయ్