క్రీడాభూమి

పాండే కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రిటోరియా, ఆగస్టు 3: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ట్రై సిరీస్ వన్‌డే టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌‘ఏ’ జట్టు దక్షిణాఫ్రికా ఎ జట్టుపై ఒక వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్‌లో స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. భారత జట్టు విజయంలో మనీశ్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాట్ చేసిన దక్షిణాఫ్రికా ఎ జట్టు హైన్రిచ్ కలాసెన్ అద్భుత సెంచరీ( 127) సాయంతో 266 పరుగులు చేసింది. 267 పరుగుల లక్ష్యాన్ని భారత ఎ జట్టు 2 బంతులు మిగిలి ఉండగా చేరుకొంది. మనీశ్ పాండే 85 బంతుల్లో 93 పరుగులు చేసి నాటవుట్‌గా నిలవడమే కాకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ కృణాల్ పాండే చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. కాగా, సంజూ శాంసన్ కూడా 90 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఒక దశలో భారత్ 7 వికెట్ల నష్టానికి 225 పరుగులతో చిక్కుల్లో పడి ఉండింది. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృణాల్ పాండే మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 పరుగులు చేయడమే కాకుండా పాండేతో కలిసి కేవలం 3.5 ఓవర్లలో 35 పరుగులు జోడించడంతో మ్యాచ్ భారత్‌కు అనుకూలంగా మారింది. టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఇది వరసగా మూడో విజయం. దీంతో జట్టు ఫైనల్‌కు చేరడం అనేది లాంఛనంగా మారింది.