క్రీడాభూమి

బాంబ్రీ సంచలన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 3: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరుగుతున్న సిటీ ఓపెన్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు యూకీ బాంబ్రీ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటుకున్నాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో మూడు సెట్ల పాటు హోరాహోరీగా పోరులో అతను డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆరో సీడ్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మోన్‌ఫిల్స్ (22వ స్థానం) తన కంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించిన బాంబ్రీ తొలి సెట్‌ను 6-3 తేడాతో కైవసం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి పోటీ తీవ్రమవడంతో 4-6 తేడాతో రెండో సెట్‌ను చేజార్చుకున్న బాంబ్రీ నిర్ణాయక మూడో సెట్‌లో మరోసారి రెచ్చిపోయాడు. ఫలితంగా 7-5 తేడాతో ఆ సెట్‌ను గెలుచుకున్న బాంబ్రీ మొత్తం మీద 111 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. మూడో రౌండ్‌లో బాంబ్రీ అర్జెంటీనాకు చెందిన గుయిడో పెల్లాతో తలపడనున్నాడు. ఈ టోర్నమెంట్ తొలి రౌండ్‌లో భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించిన పెల్లా, ఆ తర్వాత జర్మనీకి చెందిన మిషా జ్వెరెవ్‌పై 6-7, 7-6, 6-3 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌లో ప్రవేశించాడు.